నేటి నుంచి కోటి దీపోత్సవం.. తొలిరోజు జరిగే మహా ఘట్టాలు ఇవే..


కార్తిక మాసం వచ్చిందంటే చాలు.. కార్తిక స్నానాలు, దైవ దర్శనాలు, దీపారాధనతో అన్ని పుణ్యక్షేత్రాలు భక్తులతో రద్దీగా మారుతాయి.. ఇదే సమయంలో.. అందరి చూపు ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటిదీపోత్సవంపై ఉంటుంది.. ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా రచనా టెలివిజన్‌ ప్రతీ ఏటా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న విషయం విదితమే కాగా.. ఆ మహా దీపయజ్ఞం ఈ రోజు ప్రారంభం కానుంది.. ”దీపం జ్యోతిః పరంబ్రహ్మ.. దీపం సర్వతమోపహం.. దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యాదీప నమోస్తుతే” అంటారు..’ ఒక దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు.. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగుల మయం అవుతుందని నమ్మకం.. దీపం వెలుగుకు, జ్ఞానానికి సంకేతం, అధ్యాత్మికంగా దీపానికి చాలా ప్రముఖ్యం ఉంది..మన సంస్కృతికి సంప్రదాయానికి దీపారాధన పట్టుగొమ్మగా నిలిచింది.. అటువంటి సంప్రదాయాన్ని భవిష్యత్‌ తరాలకు సమున్నతంగా పరిచయం చేయడమే లక్ష్యంగా 2013 నుంచి భక్తి టీవీ కోటిదీపోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తుంది..

ఏటా కార్తీక మాసంలో దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాల నుంచి దేవతామార్తలను దేవికపై నెలకొల్పి కల్యాణాలు నిర్వహిస్తారు.. ప్రసిద్ధ పండితుల ప్రవచనాలు అందిస్తున్నారు.. పీఠాధిపతులు అనుగ్రహ భాషణ పూర్వక ఆశీస్సులు అందజేస్తారు.. అతిరథ మహారథుల అథిథులుగా విచ్చేసే ఈ దీప యజ్ఞం ఈరోజు ప్రారంభం కానుంది.. భక్తి టీవీ కోటిదీపోత్సవంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచనా టెలివిజన్‌ పక్షాన పూర్తి ఉచితంగా అందిస్తున్న విషయం విదితమే.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా భక్తి టీవీ ఈ దీప మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ వస్తుంది.. నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా కోటిదీపోత్సవం జరగనుంది.. పెద్ద సంఖ్యలో తరలిరావాల్సింది భక్తులకు ఆహ్వానం పలుకుతోంది భక్తి టీవీ..

ఇక, భక్తి టీవీ కోటిదీపోత్సవంలో తొలి రోజు నిర్వహించనున్న విశేష కార్యక్రమాల విషయానికి వస్తే..
* సమస్త పుణ్య నదుల జలాలతో కాశీస్పటిక లింగానికి సహస్రకలశాభిషేకం..
* భక్తులతో కోటిమల్లెల అర్చన..
* శ్రీశైలం శ్రీభ్రమరాంబమల్లికార్జునుల కల్యాణం..
* హంసవాహనంపై ఆదిదంపతుల దర్శనం
* సూత్తూరు శ్రీక్షేత్ర మఠాధిపతి శ్రీశివరాత్రిదేశికేంద్ర మహాస్వామి అనుగ్రహ భాషణం
* శ్రీబాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి ప్రవచనామృతం
* అపూర్వ సాంస్కృతిక కదంబాలు.. సప్తహారతుల కాంతులు.. కోటి దీపాల వెలుగులు.. మహాదేవునికి మహానీరాజనాలు..
రండి.. సాయంత్రానికి ఎన్టీఆర్‌ స్టేడియానికి.. ఆహ్వానం పలుకుతోంది రచనా టెలివిజన్‌ ప్రైవేట్ లిమిటెడ్..

Share this post with your friends