యాదాద్రి ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంత్యోత్సవాలు

యాదగిరిగుట్ట : ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంత్యోత్సవాలు. 20న ఉదయం విశ్వక్సేన ఆరాధనతో ఉత్సవాలకు శ్రీకారం, అనంతరం లక్ష కుంకుమార్చన, అలంకార సేవోత్సవం, 21న ఉదయం లక్ష పుష్పార్చన, సాయంత్రం నరసింహ మూలమంత్ర హవనం, 22న ఉదయం గర్భాలయంలో మూలవరులకు సహస్ర కలశాభిషేకం, రాత్రి నృసింహ ఆవిర్భావం.

యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో సాంస్కృతికోత్సవ వేదిక. ప్రస్తుతం తూర్పు మాడవీధిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వేదికపై ప్రతీ శుక్ర, శనివారాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు. సాంస్కృతికోత్సవం కోసం శాశ్వత వేదికను ఏర్పాటు చేయాలని ఆలయ అధికారుల నిర్ణయం. శాశ్వత సాంస్కృతికోత్సవ వేదికపై రోజూ కూచిపూడి, సంగీతం, భరత నాట్యం వంటి ప్రదర్శనలు నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆలయ ఈవో వెల్లడి.

Share this post with your friends