అభిమన్యుడిని శ్రీకృష్ణుడు ఎందుకు రక్షించలేదు?

మహాభారతం అనగానే మనకు గుర్తొచ్చేది కురుక్షేత్ర సంగ్రామం. అలాగే ఈ సంగ్రామంలో వీరమరణం పాలైన అభిమన్యుడు. అర్జనుడు, సుభద్రాదేవిల ముద్దుల తనయుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి పద్మవ్యూహం గురించి చెబుతుంటే శ్రద్ధగా ఆలకించాడు. ఇక పద్మవ్యూహం నుంచి బయటపడటం ఎలాగో చెప్పబోతుంటే అక్కడకు శ్రీకృష్ణుడు వచ్చి అర్జనుడిని తీసుకుని పోతాడు. శ్రీకృష్ణుడు కావాలనే ఇలా చేశాడు. దీంతో అభిమాన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించడం మాత్రమే తెలుసుకున్నాడు. బయట పడటం మాత్రం తెలుసుకోలేకపోయాడు.

అర్జనుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జనుడు, శ్రీకృష్ణుడు లేని సమయంలో పాండవులకు అండగా యుద్ధంలోకి ప్రవేశిస్తాడు. కౌరవులను ధీటుగా ఎదుర్కొని చివరకు పద్మవ్యూహం నుంచి బయటకు రాలేక కౌరవుల చేతిలో మరణిస్తాడు.ఈ విషయాలన్నీ తెలిసిన శ్రీకృష్ణుడు మౌనంగా ఉండిపోతాడు. దీనికి కారణం గత జన్మలో అభిమన్యుడు చంద్రుడి కుమారుడట. అభిమన్యుడిని మానవునిగా భూమి పైకి పంపడానికి ముందే చంద్రుడు తన తనయుడు భూమిపై 16 ఏళ్లు మాత్రమే ఉంటాడని చెప్పిందట. ఆ మాట ప్రకారమే 16 ఏళ్లకే అభిమన్యుడు మరణిస్తాడు. పైగా అర్జనుడు తన సోదరులపైనే యుద్ధానికి కాస్త వెనుకడుగు వేస్తూ ఉంటాడు. తనయుడిని హతమార్చడంతో పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా యుద్ధానికి దిగుతాడు.

పంచమ వేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతంలోని వీర యోధులు అనగానే ముందుగా అందరి మదిలో మెదిలే పేరు అభిమన్యుడు. పాండవుల మధ్యముడు అర్జునుడు సుభద్రాదేవి ల తనయుడు అభిమన్యు. శ్రీ కృష్ణుడి మేనల్లుడు. తల్లి కడుపులో ఉన్న సమయంలోనే తండ్రి నుంచి అస్త్రశస్త్ర విన్యాసాల గురించి అభ్యసించిన జ్ఞాని. పుట్టకముందే చక్రవ్యూహంలోకి ప్రవేశించే జ్ఞానాన్ని సంపాదించాడు. అయితే ఆ చక్ర వ్యూహం నుంచి బయటపడే మార్గం తెలియక మరణించాడు. అయితే అభిమన్యుడి యుద్ధంలో ఇలా వీర మరణం పొందడం వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది. అందుకే శ్రీ కృష్ణుడు కూడా తన ముద్దుల మేనల్లుడు అభిమన్యుని ప్రాణాలను రక్షించలేదు.

Share this post with your friends