తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి అంకురార్పణ ఘట్టం ప్రారంభమైంది. ముందుగా సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, సూపరింటెండెంట్ శ్రీ మోహన్ రావు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయ పాల్గొన్నారు.
ఇవాళ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం కార్యక్రమం జరుగనుంది. ఇవాళ ఉదయం 8.15 నుంచి 8.40 గంటల మధ్య మిథున లగ్నంలో శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
16-05-2024
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – పెద్దశేష వాహనం
17-05-2024
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం
18-05-2024
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం
19-05-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం
20-05-2024
ఉదయం – మోహినీ అవతారం
రాత్రి – గరుడ వాహనం
21-05-2024
ఉదయం – హనుమంత వాహనం
రాత్రి – గజ వాహనం
22-05-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
23-05-2024
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం
24-05-2024
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం