భగవంతునికి అన్ని పండ్లనూ నైవేద్యంగా సమర్పించారు. కొన్ని పండ్లను మాత్రమే సమర్పిస్తారు. అవేంటి? అవి భగవంతునికి సమర్పిస్తే ఏ రకమైన ఫలితం ఉంటుందనేది చూద్దాం. భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన పూర్తవుతాయి. అరటిపండును సమర్పిస్తే అనుకున్న పనులన్నీ నెరవేరుతాయట. అరటిపండును గుజ్జుగా చేసి భగవంతునికి సమరిస్తే రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుందట. శనీశ్వరునికి నేరేడు పండ్లను నైవేద్యంగా పెట్టాలి. అనంతరం వాటిని మనం తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయని నమ్మకం.
భగవంతుడికి ద్రాక్షపండ్లను నైవేద్యంగా సమర్పించి అనంతరం వాటిని పిల్లలు, పెద్దలకు పంచితే వారంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. మామిడి పండుని నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుందట. సపోటా పండును నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి సంబంధిత విషయాల్లో అడ్డంకులన్నీ తొలగిపోతాయట. యాపిల్ పండును నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలుగుతుందట. ఇక కమలా పండును భగవంతునికి నైవేద్యంగా పెడితే నిలిచిపోయిన పనులన్నీ చక్కగా పూర్తవుతాయట. పనసపండును నైవేద్యంగా పెడితే శత్రు నాశనం, రోగ విముక్తి కలుగుతుంది.