అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి?

శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయన్న విషయమై ఓ కథ ఉంది. ఈ కథ విషయాన్ని పక్కన పెడిగే శక్తి పీఠాల విషయంలో భేదాభ్రిప్రాయాలున్నాయి. కొందరు 51 అంటే.. మరికొందరు 52 అంటారు. ఇంకొందరు 108 అంటారు. అయితే శక్తి పీఠాలు ఎన్నైనా కూడా వాటిలో ప్రధానమైన అష్టాదశ అంటే 18 శక్తి పీఠాలు.. అవెక్కడున్నాయో చూద్దాం.

శాంకరి – శ్రీలంకలో ఉంది. ఈ శక్తిపీఠం ఈ దేశంలో ఎక్కడుందనే విషయంలో స్పష్టత లేదు కానీ ఈ ఆలయం మాత్రం 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల నాశనమైందంటారు.

కామాక్షి – తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరం.

శృంఖల – పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు 80 కిలోమీటర్ల దూరంలోని ప్రద్యుమ్న నగరంలో ఉంది. అయితే ఇప్పుడు అక్కడ ఆలయం ఆనవాళ్లేమీ కనిపించవు. కోలకతాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్‌ను కూడా శక్తిపీఠంగానే కొలుస్తారు.

చాముండి – కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు వద్ద గల క్రౌంచ పట్టణంలో ఉంది. ఇక్కడ అమ్మవారిని చాముండేశ్వరీ దేవి అంటారు.

జోగులాంబ – ఏపీలోని కర్నూలు నుంచి 27 కిలోమీటర్ల దూరంలోని తుంగభద్రా నది కలిసే ప్రాంతమైన ఆలంపూర్‌లో ఉంది.

బ్రమరాంబిక – ఏపీలోని శ్రీశైలంలో ఉంది. శ్రీశైలం ద్వాదశ (12) జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.

మహాలక్ష్మి – మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉంది. ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. మరో విశేషం ఏంటంటే.. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రంతో పాటు ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.

ఏకవీరిక – మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మాహుర్యం లేదా మహార్‌ల ఉంది. ఇక్కడి అమ్మవారిని ‘రేణుకా మాత’గా కొలుస్తారు.

మహాకాళి – మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని. దీనిని ఒకప్పుడు అవంతీ నగరంగా పిలిచేవారు.

పురుహూతిక – పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ – కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.

గిరిజ – ఒరిస్సాలోని జాజ్‌పూర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వైతరిణి నదీ తీరంలో ఉంది.

మాణిక్యాంబ – ఏపీలోని కాకినాడ నుంచి 20 కిలో మీటర్ల దూరంలో దక్షవాటిక లేదా ద్రాక్షారామంలో ఉంది.

కామరూప – అసోంలోని హరిక్షేత్రంలో బ్రహ్మపుత్రా నది తీరంలో ఉంది.

మాధవేశ్వరి – ఉత్తరప్రదేశ్2లోని త్రివేణి సంగమమైన ప్రయాగ (అలహాబాదు)లో ఉంది. ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.

వైష్ణవి – హిమాచల్‌ప్రదేశ్‌లోని జ్వాలాక్షేత్రం వద్ద ఉంది. ఇక్కడి విశేషమేంటంటే.. అమ్మవారి విగ్రహం ఉండదు కానీ ఏడు జ్వాలలు పురాతన కాలం నుంచి వెలుగుతున్నాయి.

మంగళ గౌరి – బీహారు – పాట్నా నుంచి 74 కిలోమీటర్ల దూరంలోని గయలో ఉంది.

విశాలాక్షి – యూపీలోని వారాణాసిలో ఉంది.

సరస్వతి – జమ్ముూ కశ్మీర్‌లో ఉంది. ఇక్కడి అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.

Share this post with your friends