చండీయాగం విశిష్టత ఏంటి?

యాగం ఏదైనా చేస్తే ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. యాగం అంటే పెద్ద క్రతువు అని అర్థం. వేదకాలంలో యాగాలను బాగా చేసేవారు. అయితే యాగం అనేది కాస్త వ్యయ ప్రయాసలతో కూడినది కాబట్టి అందరూ చేయలేరు. హిందూ సంప్రదాయం ప్రకారం చాలా యాగాలున్నాయి. వాటిలో చండీయాగం ఒకటి. అసలు ఈ యాగాన్ని ఎందుకు చేస్తారు? దీని ఫలితం ఏమిటి? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. చండీ అంటే తీవ్రమైన అని అర్థం. ఈ అమ్మవారి గురించి చాలా ప్రస్తావనలు పురాణాల్లో ఉన్నాయి.

అసలు ఛండీ అవతారాన్ని అమ్మవారు ఎందుకు ధరించాల్సి వచ్చిందో ముందుగా తెలుసుకుందాం. పూర్వం శుంభ, నిశుంభులు అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు ఈ అవతారాన్ని ధరించిందట. చండీదేవి కేవలం శుంభ, నిశుంభులనే కాకుండా వారి సేనాధిపతులు చండ ముండాసురులను కూడా సంహరించింది. అంతటి అమ్మవారిని ఉద్దేశిస్తూ చేసిన యాగానికి ఫలితం చాలా అద్భుతంగానూ.. ఊహించని విధంగానూ ఉంటుంది. అయితే ఈ చండీయాగాన్ని అంతా చేయించుకోలేరు. అలాంటి వారు ఈ చండీయాగాన్ని చూసినా, హోమగుండానికి నమస్కరించినా, హోమ విభూతిని నుదుటన ధరించినా విశేషమైన ఫలం లభిస్తుందని అంటారు.

Share this post with your friends