రామాయణం అంటే ఏంటి? జీవితంలో రాముడు ఎంతలా భాగమయ్యాడో తెలుసా?

రామాయణం హిందువుల జీవితంలో ఒక భాగమై పోయింది. రాముడి గమనాన్ని రామాయణం అంటారు. రామాయణమే కాదు… రాముడు కూడా మన జీవితంలో భాగమైపోయాడు. బిడ్డ పుట్టగానే శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అని దీవిస్తారు. ఇలా పసికందులకు ఇచ్చే దీవెనల నుంచి ‘రామ లాలి మేఘ శ్యామలాలి’ అంటూ తల్లి పాడే జోల పాటలో సైతం రాముడు ఉంటాడు. అలాగే పిల్లవాడు బుద్దిగా ఉంటే.. రాముడు మంచి బాలుడు అని అంటుంటారు. ‘ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కోరలు తెల్లన.. ఏనుగ మీద రాముడు’ అంటూ చిన్నారులు పాడుకుంటూ ఉంటారు.

రామ అనే రెండక్షరాల పేరులో ఎంతో మహిహ ఉంది. ఈ రామను అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో చాలా మందికి తెలియదు. ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రం నుంచి ‘రా’ అనే అక్షరాన్ని.. ఓం నమశివాయ పంచాక్షరి నుంచి ‘మ’ వచ్చింది. ఈ రెండింటినీ కలిపితే ‘రామ’. రామ నామంలో శివకేశవతత్వం ఇమిడి ఉంటుంది. కాబట్టి ఈ నామం ఎంతో దివ్యమైనది. అందుకే శ్రీరాముడికి అంతటి ప్రాధాన్యత. స్వామివారి కల్యాణం అంటేనే లోకకల్యాణం. ఊరువాడల పండుగ.

Share this post with your friends