ఈ శివాలయాన్ని ఏడాదికి రెండు సార్లే తెరుస్తారు.. కారణమేంటంటే..

ఓ శివాలయాన్ని సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే తెరుస్తారు. ఈ ఆలయం శ్రావణ మాసం, శివరాత్రి రోజులలో తెరవబడుతుంది. ఈ స్వామివారిని పాతాలేశ్వర్ మహాదేవ్ అని పిలుస్తారు.ఈ ఆలయం గిర్కంఠలోని గిర్ అటవీ ప్రాంతంలోని నిషేధిత ఏరియాలో ఉంది. అడవిలోని నిషేధిత ప్రాంతంలో ఈ పాతాలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. ఇక ఈ అడవి గుజరాత్‌లోని ఘాటా టాప్ ఒనేరాయ్ మధ్య ఉంది. ఈ ఆలయానికి వెళ్లాలంటే గడ్డా నుంచి అయితే 16 కిలోమీటర్లు.. ఉనా నుంచి 34 కిలోమీటర్ల దూరంలోఉంది. సాధారణంగా ఈ ఫారెస్ట్‌ ఏరియా మొత్తం నిషేధిత ప్రాంతం.

నిషేధిత ప్రాంతం కావడంతో అటవీ శాఖ ఈ ఆలయాన్ని ఏడాదికి రెండు సార్లు మాత్రమే తెరుస్తారు. అయితే పాతాలేశ్వర్ మహాదేవ్ ఆలయానికి వెళ్లి భక్తి శ్రద్ధలతో స్వామివారిని వేడుకుంటే పక్కాగా మన కోరిక నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు మక్కువ చూపిస్తున్నారు. స్వామివారి ఆలయాన్ని తెరిచే శ్రావణ మాసం, శివరాత్రి రోజుల్లో ఆలయానికి పెద్ద ఎత్తున భక్తుల తాకిడి ఉంటుంది. ఈ క్రమంలోనే భక్తులకు అటవీ శాఖ ఎప్పుడూ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉంటుంది. అరణ్యంలో జంతువులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మహాదేవుని ఆలయానికి వచ్చే భక్తులు అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ బాటిళ్లు, చెత్తను వేయవద్దని స్థానిక ప్రజలతో పాటు దర్శనానికి వచ్చే భక్తులకు అటవీశాఖ విజ్ఞప్తి చేసింది.

Share this post with your friends