శివపార్వతులు నెలవైన కైలాస పర్వతం.. సైన్స్‌కు కూడా అంతచిక్కని రహస్యం..

కైలాస పర్వతం గురించి వినని వారుండరు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉంటారని అంటారు. టిబెట్ భూభాగంలో వున్న హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్రమట్టానికి 6.638 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ కైలాస పర్వతం గురించి విని ఉంటారు. కానీ పూర్తి స్థాయిలో వివరాలు ఎవరికీ తెలిసి ఉండవు. కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో కనిపిస్తుంటుంది. ఒకవైపు సింహం.. నెమలి.. ఏనుగు.. గుర్రం రూపాల్లో దర్శనమిస్తుంది. రూపాల్లో మాత్రమే కాదు.. నాలుగు రంగుల్లో దర్శనమిస్తుంటుంది. విష్ణుపురాణం ప్రకారం కైలాస పర్వతం నాలుగు ముఖాలు స్ఫటిక, బంగారం, రుబి, నీలం రాయితో రూపొందించబడింది. ఈ కైలాస పర్వతం.. తామరు పువ్వు ఆకారంలో ఉన్న ఆరు పర్వతాల మధ్య ఉంటుంది.

కైలాస పర్వతం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక పౌర్ణమినాడు చంద్రుడి వెలుగులో ఈ పర్వతం కాంతులీనుతూ అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకూ ఈ పర్వతాన్ని అధిరోహించన వారు లేరు. ఇది ఎవరికీ సాధ్యం కాదని అంటారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. పూర్వం దీనిని ఎక్కేందుకు ప్రయత్నించిన కొందరు సాధువులు మధ్యలోనే అదృశ్యమయ్యారట. వారి జాడే తెలియలేదు. ఈ ఆధ్యాత్మిక పర్వతంపై కాలు పెట్టడం మహా పాపమని హిందువులు విశ్వసిస్తూ ఉంటారు. దీనిని మూఢ నమ్మకంగా నిరూపించేందుకు కొందరు యత్నించినా కూడా అది విఫల యత్నంగానే మిగిలిపోయింది. ఈ పర్వత ఉపరి భాగం ఇంతవరకూ సైన్స్‌కు కూడా అంతు చిక్కని రహస్యం.

Share this post with your friends