ఎవరైనా సరే.. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే.. కొన్ని విషయాలను దాచాలట. జీవిత భాగస్వామి వద్ద కూడా కొన్ని విషయాలను చెప్పకూడదట. ఇలా చేస్తే జీవితంలో సక్సెస్ పక్కా వస్తుందట. అసలు ఏ ఏ విషయాలను ఎవరికీ షేర్ చేయకూడదో చూద్దాం. పురుషులు కుటుంబ వివాదాలు కానీ ఇంటికి సంబంధించిన విషయాలను కానీ ఎవరికీ చెప్పకూడదట. అలాగే భార్యపై కోపం వచ్చింది కదా అని ఆమెకు వ్యక్తిత్వం నుంచి ఏ విషయాన్ని కూడా ఎవరితోనూ పంచుకోవద్దట. ఇలా పంచుకుంటే.. ఈ విషయాలపై అప్పుడు స్పందిస్తారో లేదో కానీ ఆ తరువాత మాత్రం వాళ్లు తమ అవసరానికి అనుగుణంగా ఈ విషయాలను ఉపయోగిస్తారు.
అలాగే జీవితంలో ఎదురైన అవమానాల గురించి సరదాగా కూడా ఎవరికీ చెప్పకూడదు. అవి వేరొకరికి చెప్పి మిమ్మల్ని మరింత అవమానాలకు గురి చేసే అవకాశముంది. ఇవి మరింత మిమ్మిల్ని కుంగదీయవచ్చు.. కాబట్టి ఇలాంటి విషయాలను ఎంత గోప్యంగా ఉంచితే అంత మంచిది. ఇక కీలకమైన విషయం వచ్చేసి డబ్బు. దీనికిక సంబంధించిన విషయాలను అస్సలు పంచుకోవద్దు. డబ్బు సంబంధిత విషయాల కారణంగా అసూయ, ద్వేషాలు పెరుగుతాయి కాబట్టి ఆదాయం బయటకు చెప్పకూడదు. యోగా గురువు దగ్గర దీక్ష తీసుకున్నా కూడా ఆ గురు మంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదట. అలాగే విరాళాలను గోప్యంగా ఉంచాలట. దీనివల్ల పురోగతితో పాటు జీవితంలో విజయం సిద్ధిస్తుందట.