శనివారం సంకష్ట చతుర్థి.. వినాయకుడిని ఎలా పూజిస్తే ప్రసన్నుడవుతాడో తెలుసా?

సంకష్ట చతుర్థి గురించి మీకు తెలుసా? దీనిని వైశాఖ మాసం కృష్ణ పక్ష చతుర్థిన వినాయకుడిని పూజిస్తూ సంకష్ట చతుర్థిని జరుపుకుంటారు. ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ వినాయకుడు మొదటి పూజను అందుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా సంకష్ట చతుర్థి నాడు వినాయకుడిని పూజించి ఉపవాసం ఉంటే మంచి జరుగుతుందని నమ్మకం. ఇక ఈ సంవత్సరం సంకష్ట చతుర్థి రేపు అంటే ఏప్రిల్ 27న రానుంది. ఈ రోజున గణేషుడిని పూజిస్తే సంకలాలన్నీ తొలిగిపోయి సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్మకం.

ఈ రోజున ఏమేం పూజలు చేయాలంటే..

దర్భ గడ్డి : కష్ట చతుర్థి రోజున గణేశుడిని దర్భ గడ్డితో పూజించాలి. గర్భగడ్డి వినాయకుడికి చాలా ఇష్టం. అలాగే ఈ పూజలో ఇదం దుర్వా.. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ 11 జతల దుర్వాను వినాయకుడికి సమర్పించాలి.

సింధూరం: గణేశుడికి సింధూరాన్ని సమర్పించాలి. అలా సమర్పిస్తూ.. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని పఠించాలి. దీంతో మన కోరికలన్నీ తీరుతాయి.

జమ్మి ఆకులు: జమ్మి ఆకులు గణేశుడికి చాలా ఇష్టం. కాబట్టి సంకష్ట చతుర్థి నాడు వినాయకుడికి శమీ ఆకులతో పూజించాలి.

Share this post with your friends