ఈ ఆలయంలోని అమ్మవారు ప్రత్యేకతేంటో తెలిస్తే షాకవుతారు..

ప్రతి ఆలయానికి ఒక విశిష్టత ఉంటుంది. ఈ ఆలయంలో అమ్మవారు రోజుకు మూడు సార్లు రూపం మార్చుకుంటే వినడానికి షాకింగ్‌గా అనిపించినా ఇది జనం. ఉదయం అమ్మాయిలా.. మధ్యాహ్నం యువతిలా.. సాయంత్రం వృద్ధురాలిగా కనిపిస్తుంది. ఇంతకీ ఎవరీ అమ్మవారు? ఎక్కడుంటారంటే.. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో శ్రీనగర్, రుద్రప్రయాగ మధ్య అలకనంద నది ఒడ్డున ఉంటారు. అమ్మవారి పేరు ధారీ దేవి. శ్రీనగర్ నుంచి 14 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ధారీ దేవి అమ్మవారే చార్‌ధామ్‌ను రక్షిస్తోందని ఓ నమ్మకం.

పర్వతాలను, యాత్రికులను రక్షించే దేవతగా ఈ అమ్మవారిని కొలుస్తారు. మరో విశేషం ఏంటంటే.. ఈ ఆలయంలో ధారీ దేవి విగ్రహం పైభాగం మాత్రమే ఉంది. కింది భాగం ఎక్కడుందంటారా? సమీపంలోని కాళీమాత ఆలయంలో ఉంది. ఇక్కడ ఆమె కాళీ దేవిగా పూజలు అందుకుంటోంది. ఇక ధారీ దేవి మూడు పూటలా తన రూపు రేఖలు మార్చే దృశ్యం మనల్ని షాక్‌కి గురి చేస్తుంది. పురాణాల ప్రకారం.. వరదల కారణంగా ఒకసారి ఆలయంతో పాటు అమ్మవారి విగ్రహం కూడా కొట్టుకుపోయింది. అయితే ధరో గ్రామ సమీపంలో ఒక రాయిని తట్టి విగ్రహం అక్కడే నిలిచిపోయింది. ఈ విగ్రహం నుంచి వచ్చిన దివ్యస్వరం ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్టించాలని సూచించిదని గ్రామస్తులు చెబతారు. ఆ తరువాత ధారీ దేవి ఆలయ నిర్మాణం జరిగింది.

Share this post with your friends