హిందూ మతంలో మోహినీ ఏకాదశికి ఉన్న ప్రాధాన్యమే వేరు. ఈ రోజున మోహినీ అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని కొలుస్తూ ఉంటాం. వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి నాడు మోహినీ ఏకాదశి ఉపవాసం ఆచరిస్తారు. ఈ మోహినీ ఏకాదశికి సంబంధించి ఓ కథ విన్నా.. చదివినా కూడా పుణ్యమట. అదేంటంటే.. సరస్వతీ నది ఒడ్డున భద్రావతి నగరాన్ని ద్యుతిమాన్ అనే చంద్రవంశీ రాజు పరిపాలించేవాడు. ఇదే నగరంలో విష్ణు భక్తుడైన ధనపాల్ అనే వైశ్యుడు కూడా ఉండేవాడు. నగరంలో ధనపాల్ పూటకూళ్ల ఇల్లు, చెరువులు, బావులు, చెరువులు, ధర్మశాలలను నిర్మించారు. వైశ్యుడికి సుమన్, సద్బుద్ధి, మేధావి, సుకృతి, దృష్ట బుద్ధి అనే ఐదుగురు కుమారులున్నారు. దుష్ట బుద్ధి పేరుకు తగ్గట్టే సద్బుద్ధి కలవాడు కాదు.
అతని పనుల కారణంగా ధనపాల్ తీవ్ర ఆవేదనకు గురై ఇంటి నుంచి పంపించేస్తాడు. ఆకలి, దాహానికి తాళలేక దుష్ట బుద్ధి దొంగతనం బాట పట్టాడు. ఒకరోజు దొంగతనం చేస్తూ పట్టుబడితే ధనపాల్ కొడుకుని వదిలేస్తారు. రెండోసారి కూఔఝషైప.ూడా పట్టుబడితే తీవ్రమైన చిత్రహింసలను శిక్షగా వేసి అనంతరం నగరం నుంచి బహిష్కరించారు. దీంతో దుష్టబుద్ధి అడవి బాట పట్టారు. జంతువులు, పక్షులను వేటాడుతూ.. జంతువులు, పక్షులను వేటాడుతూ ఆకలిదప్పులు తీర్చుకునేవాడు. ఒక రోజు ఆకలి, దాహంతో విలవిల్లాడుతూ ఆహారం కోసం కౌండిన్య ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు. కౌండిన్య మహర్షికి చేతులు జోడించి.. తన పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమని కోరాడు. మహర్షి సంతోషించి మోహినీ ఏకాదశి రోజున ఉపవాసం ఉండమని కోరాడు. దీంతో దుష్ట బుద్ధి ఉపవాసం చేసి పాపాల నుంచి విముక్తుడై మరణానంతరం గరుడినిపై కూర్చొని విష్ణు లోకానికి వెళ్లాడు.