ఈ నెల 21 నుంచి 29వ తేదీ వరకూ జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మే 20వ తేదీన అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు ప్రారంభించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలను నిర్వహించనున్నారు. మే 30వ తేదీన సాయంత్రం 6 గంటలకు పుష్ప యాగం నిర్వహిస్తారు. మే 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. రూ.300/- చెల్లించి దంపతులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. దంపతులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
21-05-2024
ఉదయం – ధ్వజారోహణం
సాయంత్రం- పెద్దశేష వాహనం
22-05-2024
ఉదయం – చిన్నశేష వాహనం
సాయంత్రం- హంస వాహనం
23-05-2024
ఉదయం – ముత్యపుపందిరి వాహనం
సాయంత్రం- సింహ వాహనం
24-05-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం
సాయంత్రం- హనుమంత వాహనం
25-05-2024
ఉదయం – పల్లకీ ఉత్సవం
సాయంత్రం- గరుడ వాహనం
26-05-2024
ఉదయం – సర్వభూపాల వాహనం
సాయంత్రం- కల్యాణోత్సవం, గజ వాహనం
27-05-2024
ఉదయం – రథోత్సవం
సాయంత్రం- అశ్వవాహనం
28-05-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
సాయంత్రం- చంద్రప్రభ వాహనం
29-05-2024
ఉదయం – చక్రస్నానం
సాయంత్రం- ధ్వజావరోహణం