ఈ మొక్కను ఇంట నాటారో.. లక్ష్మీదేవి మీ ఇల్లు వదలదట..

ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువు మన ఫేట్‌ను సానుకూలంగానూ వ్యతరేకంగానో మార్చేస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి మనం ఉండే ఇంటికి వాస్తు తప్పనిసరి అని అంటారు. అలాగే మనం ఇంట్లోని వస్తువుల విషయంలో మాత్రమే కాదు.. ఇంట్లో నాటే మొక్కల విషయంలోనూ జాగ్రత్త తప్పనిసరి అని వాస్తు శాస్త్రం చెబుతోంది. శంఖ పుష్పం లేదం శంఖ పుష్పం మొక్క లేదా అపరాజిత మొక్క గురించి తెలుసా? ఈ మొక్క అందానికే కాదు.. అదృష్టానికి సైతం చాలా కీలకమట. తీవ్రమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నా.. జాతకంలో శని దోషం ఉన్నా కూడా ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే దోషాలన్నీ తొలగిపోవడమే కాకుండా ఆర్థికంగా కూడా చాలా బాగుంటామట.

శంఖు పుష్పం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుందట. లక్ష్మీదేవి మాత్రమే కాకుండా శివుడు, విష్ణుమూర్తి, శనీశ్వరుడికి ఈ మొక్క చాలా ఇష్టమైనదట. అయితే ఈ మొక్కను ఇంట్లో నాటదలుచుకుంటే మాత్రం సరైన దిశలో నాటాలి.. అలాగే ఏ రోజు మొక్క నాటేందుకు శుభప్రదమో కూడా తెలుసుకోవాలి. అలా లెక్క ప్రకారం నాటితే ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సును తీసుకువస్తుందట. ఈ మొక్క మన ఇంట ఎప్పుడూ గణేశుడు, లక్ష్మీదేవి, కుబేరుడు నివసించే దిశలో అంటే ఇంటికి తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య మూలలో నాటాలి. ఇక ఈ మొక్కను గురువారం లేదా శుక్రవారం నాటాలట. గురువారం విష్ణుమూర్తికి ,శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ రోజుల్లో నాటితే అంతా మంచి జరుగుతుందని నమ్మకం.

Share this post with your friends