శ్రీవాణి భక్తులకు శాశ్వత టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన

తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులకు కేటాయిస్తున్న టికెట్ల జారీని టీటీడీ ఈవో పరిశీలించారు. శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు జారీ చేయాలన్నారు. ఇందుకోసం గోకులం వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం దాతల విభాగం ప్రక్కన ఉన్న ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలికంగా శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల జారీ కౌంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో భక్తులు వేచి ఉండేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం ప్రస్తుతం ఉన్న డిఎఫ్ఓ కార్యాలయంలో పూర్తిస్థాయిలో శ్రీవాణి టికెట్ల జారీ కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో టికెట్లు జారీ చేయు కౌంటర్లు, 200 మంది భక్తులు వేచి ఉండేందుకు వీలుగా సీటింగ్, పార్కింగ్, మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తరువాత ఈవో శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలను, తిరుమలనంబి ఆలయం, బయోమెట్రిక్ ను పరిశీలించారు.

Share this post with your friends