వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తనిఖీ.. సౌకర్యాలను భక్తులను అడిగి తెలుసుకున్న టీటీడీ ఈవో

వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను ఈవో శ్రీ జె. శ్యామలరావు శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో భక్తులకు అందుతున్న అన్నప్రసాదాలు, తాగునీరు, శ్రీవారి సేవకులతో పాలు పంపిణీ తదితర విషయాలను భక్తులను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

భక్తులను దర్శనానికి అనుమతించేటప్పుడు గేట్లు తెరవడం, కంపార్ట్మెంట్లలో పారిశుద్ధ్య చర్యలు, పెద్ద స్క్రీన్ లలో ప్రసారం అవుతున్న ఎస్వీబీసీ కార్యక్రమాలు, వివిధ భాషలలో భక్తులకు అందిస్తున్న సమాచారం తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈవో వెంట జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఇ -2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఎలక్ట్రికల్ డిఈ శ్రీరవిశంకర్ రెడ్డి, విజిఓ శ్రీ నందకిషోర్, ఇతర అధికారులు ఉన్నారు.

Share this post with your friends