స్వర్ణ రథంపై భక్తులను అనుగ్రహించిన మలయప్ప స్వామి.. స్పెషల్ అట్రాక్షన్‌గా వసంత మండపం..

తిరుమల వార్షిక వసంతోత్సవాల నేపథ్యంలో స్వర్ణరథంపై ఆలయ తిరు వీధుల్లో ఊరేగుతూ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇస్తున్నారు. కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వ‌సంత‌ మండ‌పాన్ని శేషాచల అడవులను త‌ల‌పించేలా ప‌లు ర‌కాల జంతువులు, చెట్ల ప్రతిరూపాలతో అందంగా తీర్చిదిద్దారు. ఇక నిన్న తొలిరోజు ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై మాడవీధుల్లో ఊరేగిన అనంతరం వసంత మండపానికి చేరుకున్నారు.

ఇక వసంత మండపాన్ని ఆకర్షణీయంగా తయారు చేశారు. 250 కేజీల వట్టివేరుతో అలంకరించారు. పది వేల కట్ ఫ్లవర్స్, 600 కేజీల సాంప్రదాయ పుష్పాలతో సర్వాంగ సుందరంగా తయారు చేశారు. ఇక అడవిలో కనిపించే జంతువులు, పక్షులన్నింటి ఆకృతులను ఏర్పాటు చేశారు. ఇక ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమజాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. నేడు మలయప్ప స్వామివారు స్వర్ణ రథంపై భక్తులను అనుగ్రహించారు. మూడు రోజుల పాటు వసంతోత్సవాల నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.

Share this post with your friends