30న తిరుమల నాద నీరాజనం వేదికపై ఉగాది కవి సమ్మేళనం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉగాది పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఆస్థానం ఘనంగా జ‌రిగింది. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ ఈ ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 30వ తేది తిరుమలలోని శ్రీ మలయప్ప స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న నాద నీరాజనం వేదికపై కవి సమ్మేళనం కార్యక్రమం జరగనుంది. ఏడు కొండలపై ఏడు కొండలవాడి సాక్షిగా ఏడుగురు కవులతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. 30వ తేది మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందులో మన సంస్కృతి, సాంప్రదాయాలు, టీటీడీ భక్తులకు చేస్తున్న సేవలపై కవులు పద్యాల రూపంలో వివరిస్తారు.

Share this post with your friends