దేశంలోని ప్రఖ్యాతిగాంచిన అమ్మవారి ఆలయాల్లో వైష్ణోదేవి ఆలయం ఒకటి. కశ్మీర్‌లోని దర్శించుకోదగిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి వస్తుంటారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లినవారు ఆ ఆలయాన్ని ఒక్కదాన్ని సందర్శించుకుని మాత్రమే తిరిగి వచ్చేయరు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని కొన్ని ఆలయాలను దర్శించుకున్నాకే తిరిగి వస్తారు. మరి వైష్ణోదేవి ఆలయానికి దగ్గరలో కొన్నిదర్శించుకోదగిన ప్రదేశాలను తెలుసుకుందాం. మరి ఆ ప్రదేశాలేంటో తెలుసుకుందాం.
సిహాద్ బాబా: ఇధొక అందమైన జలపాతం. కత్రా నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఉంది. ఈ ప్రదేశాన్ని సందర్శించామంటే తిరిగి రావాలనిపించదు. జనసమూహానికి దూరంగా.. ప్రశాంతంగా గడిపేందుకు ఇదొక అద్భుతమైన ప్రదేశం.
శివఖోడి: ఇది కూడా జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఉంది. శివఖోడిలో శివుడు కొలువై ఉన్నాడు. ఇదొక ప్రసిద్ధ గుహాలయం. కత్రా నుంచి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పవిత్ర గుహ లోపల 4 అడుగుల ఎత్తైన శివలింగం ఉంది. మీరు చూడదగిన అద్భుత ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి.
మన్సార్: కత్రా నుంచి దాదాపు 32 కిలోమీటర్ల దూరంలో మన్సార్ ఉంటుంది. దట్టమైన అడవులు, పర్వతాలతో చుట్టుముట్టబడిన ఈ ప్రదేశం ప్రకృతి సందర్శనకు నిలయం. ఇక్కడికి వెళ్లిన వారు.. మన్సార్ సరస్సు, సురిన్సార్ సరస్సు , సురిన్సార్-మన్సార్ వన్యప్రాణుల అభయారణ్యం వంటివి సందర్శించవచ్చు.
హిమ కోటి: కత్రా నుంచి హిమకోటికి దూరం దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన ప్రదేశం ఇది. ఈ లోయ సహజ దృశ్యం చాలా ఆకర్షణీయంగానూ… ప్రశాంతతకు నిలయంగానూ ఉంటుంది. ఇదొక కృత్రిమ చెరువు.