ఆంజనేయుని జన్మ వృత్తాంతమేంటంటే..

ఉగాది, శ్రీరామనవమి, హనుమత్ జయంతి ఈ మూడు పండుగలు వరుసగా వస్తాయి. శ్రీరామనవమి వెళ్లిన ఆరో రోజులకు హనుమత్ జయంతి వచ్చింది. అయితే హనుమంతుడి జననం గురించి శ్రీ రామాయణం, శివపురాణం వంటి గ్రంథాలలో ఎన్నో కథలు ఉన్నాయి. వాటిలో ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంద్రలోకంలో పుంజికస్థల అనే అప్సరస ఉండేది ఆమె ఒకసారి దేవగురువైన బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగాలు చేయసాగింది. కనీసం సందర్భం లేకుండా ఆమె హాస్య ప్రసంగాలు చేయడంతో పాటు ఆమె హావభావాలు సైతం చాలా వికారంగా ఉన్నాయట.

ఆమె ఎంతకీ ఆపకుండా ప్రసంగాలు చేస్తూనే ఉండటంత ఆగ్రహించిన బృహస్పతి పుంజికస్థలను భూలోకంలో వానర కాంతగా జన్మించమని శపించాడట. దీంతో భయపడిపోయిన పుంజికస్థల బృహస్పతిని శరణు వేడుకుందట. అప్పుడు బృహస్పతి శాంతించి భూలోకంలో హనుమంతునికి జన్మనిచ్చిన మీదట ఇంద్రలోకానికి తిరిగి వస్తావని శాపానికి ఉపశమనం చెప్పాడట. బృహస్పతి శాపానుసారం పుంజికస్థల భూలోకంలో అంజనాదేవి పేరుతో వానర కాంతగా జన్మించి యుక్త వయసు వచ్చాక కేసరి అనే అందమైన వానరాన్ని ప్రేమించి పెళ్లాడిందట. అనంతరం దంపతులిద్దరూ సత్సంతానం నిత్యం శివుడిని ఆరాధిస్తూ ఉండగా వాయుదేవుడు శివుని తేజస్సును పండు రూపంలో అంజనాదేవికి ఇవ్వగా.. ఆమె గర్భవతియై ఆంజనేయుడికి కిష్కిందా నగరమున జన్మనిచ్చిందట.

Share this post with your friends