రత్నగిరి కొండపై కొలువైన సత్యనారాయణ స్వామి ఆలయ విశేషాలేంటంటే..

కోరిన కోర్కెలు తీర్చే భక్త వరదుడిగా భక్తులంతా అన్నవరం- శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామిని కొలుస్తారు. అన్నవరం సత్తెన్న అని భక్తులు ముద్దుగా పిలుచుకుంటారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో కొలువైన సత్యనారాయణ స్వామికి కుడిపక్కన ఈశ్వరుడు, ఎడమ పక్కన అనంతలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. రెండు అంతస్తుల్లో ఉండే ఈ ఆలయంలో మొదటి అంతస్తులో స్వామివారి మూలస్తంభం, పాదాలను దర్శించుకోవాలి. మెట్లపైగా పైఅంతస్తుకు వెళితే శ్రీసత్యనారాయణస్వామి మహేశ్వరుడు.. అనంతలక్ష్మి అమ్మవారు ఒకే పీఠంపై దర్శనమిస్తారు.

తూర్పు గోదావరి జిల్లాలోని తుని పట్టణానికి 15 కి.మీ దూరంలో రత్నగిరి పర్వతంపై సత్యనారాయణ స్వామి కొలువై ఉంటాడు. ఈ ఆలయ విశేషం ఏంటంటే.. శివకేశవులు ఒకే పీఠంపై అలాగే అమ్మవారు ఒకేచోట కనిపించే ఆలయం ఇది తప్ప మరోచోట కనిపించదు. ఇక్కడ నిత్యం శ్రీ సత్యనారాయణ స్వామివారికి సుప్రభాత సేవ మొదలు ఇతర సేవలు, పలు ప్రత్యేక కార్యక్రమాలు, ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంటారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయానికి వస్తుంటారు. పైగా వివాహాలు, వివాహానంతరం నిర్వహించే వ్రతాలు ఇక్కడ నిర్వహిస్తుంటారు. ఈ వ్రత విశిష్టతను పురాణాల్లో సైతం వివరించారు.

Share this post with your friends