మాసఫలం : Feb-2024

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) : ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. స్పష్టమైన ఆలోచన విధానంతో కార్యసిద్ధిని సాధించగలుగుతారు. కీలక విషయాల్లో కుటుంబసభ్యుల సలహాలు మేలుచేస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. బుద్ధిబలంతో సమస్యలు అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. తగిన రాబడి ఉంటుంది. బదిలీ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. సూర్యారాధనతో మేలు కలుగుతుంది.

వృషభం (కృత్తిక 2-4, రోహిణి, మృగశిర 1-2 పాదాలు) : మధ్యమ ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. అధికారులతో సంయమనంగా ఉండండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి తగిన డబ్బు అందుతుంది. ఖర్చులను మాత్రం నియంత్రించాలి. అనవసర కలహ సూచితం అవుతోంది. నిర్ణయాల్లో స్థిరత్వం ఉండకపోవచ్చు. కుటుంబసభ్యులకు సమయాన్ని కేటాయిస్తారు. వివాహ ప్రయత్నాలకు మంచి సమయమిది. ఇష్టదేవతారాధనతో మరిన్ని శుభఫలితాలు అందుకోగలుగుతారు.

మిథునం (మృగశిర 3-4, ఆర్ద్ర, పునర్వసు 1-3 పాదాలు) : చక్కటి ప్రణాళికలతో లక్ష్యాన్ని సాధిస్తారు. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. కీలక అంశాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. ఆర్ధికంగా పురోగతి ఉంటుంది. మీ ఆలోచనే మీ విజయానికి మూలమని గుర్తుంచుకోండి. ఒక్కొక్కసారి మీ చంచల స్వభావమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. స్థిరమైన నిర్ణయాలే మేలు చేకూరుస్తాయి. నెల మధ్యలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఇష్టదేవతా నం, దర్శనంతో మరిన్ని శుభాలు కలుగుతాయి.

కర్కాటకం (పునర్వసు 4వ, పుష్యమి, ఆశ్లేష 1-4 పాదాలు) : ఆర్థికంగా మిశ్రమ కాలం గడుస్తోంది. ఖర్చులు పెరగకుండా ముందు జాగ్రత్త వహించండి. మీ మీ రంగాల్లో చక్కటి ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల వారందరికీ అనుకూలంగా ఉంటుంది. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించండి. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్య విషయాల్లో సకాలంలో స్పందించడం ద్వారా మాత్రమే మేలైన ఫలితాలు పొందుతారు. శారీరక మానసిక ఇబ్బందులు ఏర్పడకుండా శ్రద్ధ వహించండి. విష్ణు స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. ముఖ్యమైన విషయాల్లో ఆటంకాలు ఎదురుకాకుండా ముందుచూపుతో వ్యవహరించండి. స్థానచలన సూచనలున్నాయి. వ్యాపారంలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగపరంగా అధికారులతో, పెద్దలతో సంయమనం పాటించాల్సి ఉంటుంది. వృత్తిలో చక్కని అభివృద్ధి నమోదు చేస్తారు. ఆరోగ్యపరంగానూ, ఆర్థికపరంగానూ బాగుంటుంది. క్రమంగా అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు అనుకూలం కాలమిది. శ్రద్ధగా చదవడం మరిచిపోవద్దు. సూర్యారాధన కొనసాగించండి.

కన్య (ఉత్తర 2-4, హస్త, చిత్త 1-2 పాదాలు) : చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. మీ మీ రంగాల్లో శుభఫలితాలు దక్కుతాయి. బుద్ధిబలంతో పనిచేసి కీలక సమస్యను పరిష్కరించుకుంటారు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. మధ్య – మధ్య స్వల్పంగా ఆర్థిక ప్రయోజనాలు కూడా దక్కుతాయి. ఆధ్యాత్మిక అంశాలకు ప్రాధాన్యతనిస్తారు. ఇతరుల సలహాలు సూచనలు మేలు చేస్తాయి. ఆదివారాల్లో సూర్యారాధన చేయండి.

తుల (చిత్త 3-4, స్వాతి, విశాఖ 1-3 పాదాలు) : ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల సహకారంతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సమాజంలో మంచి పేరు దక్కుతుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైన సమయం. అయితే ప్రణాళికాబద్దంగా సాగడం ముఖ్యమని గుర్తుంచుకోండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగండి. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులకు తగిన ఆదాయం ఉంటుంది. శివాభిషేకంతో మరిన్ని శుభాలు పొందగలుగుతారు.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : దైవబలంతో మంచి చేకూరుతుంది. గతం కంటే ఎక్కువ అనుకూలతలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు లాభదాయక ఫలితాన్నిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. గృహ లాభాలున్నాయి. ప్రయాణాలు ఉపకరిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలతో ప్రయోజనాలు కలగచేస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అనుకున్నమేరకు లాభాలను పొందగలుగుతారు. దుర్గాదేవి ఆరాధనతో శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) : విశేషమైన కార్యసిద్ధి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుగణంతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆర్థిక లాభం పొందుతారు. ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగపరంగా పై అధికారులతో సంయమనంగా ఉండండి. ఖర్చులు పెరుగుతాయి. నెల చివర్లో మేలు జరుగుతుంది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. క్రియ విక్రయాలతో లాభమే ఉంటుంది. శివాభిషేకం, సూర్యారాధనతో మరిన్ని శుభఫలితాలు అందుకోగలుగుతారు.

మకరం (ఉత్తరాషాఢ 2-4, శ్రవణం, ధనిష్ఠ 1-2 పాదాలు) : మిశ్రమ కాలం గడుస్తోంది. లక్ష్యాలను సాధించేందుకు శ్రమిస్తారు. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అవసరానికి తగిన డబ్బు అందుతుంది. ఖర్చులను మాత్రం నియంత్రించుకోవాలి. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. మాట విలువను కాపాడుకోవాలి. వృధా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సామాన్య ఫలితాలు దక్కుతాయి. నిరాశను దూరం పెట్టండి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

కుంభం (ధనిష్ట 3-4, శతభిషం, పూర్వాభాద్ర 1-3 పాదాలు) : కొంతమేరకు శుభాలు జరుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. అందరి మన్ననలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం వల్ల ఇంట గెలుస్తారు. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన కాలం. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అంత అనుకూలమూ కాదు.. అంత వ్యతిరేకమూ ఉండదు. ఆర్థికం – ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు కొనసాగించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నవగ్రహ ధ్యానంవల్ల శుభం కలుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : మీరు అనుకున్న విజయాన్ని సాధించేందుకు పట్టు వదలకండి. పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగండి. సమాజంలో పేరుప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా శ్రద్ధ అవసరం. ముఖ్యవిషయాల్లో తొందరపాటు వద్దు. శత్రువులతో, మోసం చేసేవారితో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో ఏమరపాటు వద్దు. అనారోగ్య సూచనలున్నాయి. ఇతరుల విషయాలు మీకు అనవసరమని గుర్తుంచుకోండి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. విఘ్ననివారణకు గణపతిని ఆరాధించడం శ్రేయస్కరం.

Share this post with your friends