అర్జనుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందింది ఇక్కడేనట..

కనక వర్ష ధాత్రి కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై వెలసిన మహాశక్తి. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా దుర్గమ్మ పూజలందుకుంటోంది. శక్తికి నిదర్శనంగా ఈ అమ్మలగమ్మను అమ్మను భక్తులు కొలుచుకుంటారు. విజయవాడ పట్టణంలో, ఇంద్రకీలాద్రి పర్వతంపై మహోన్నతంగా కొలువై ఉన్న అమ్మవారు. ఈ కొండ మధ్యగా ప్రవహించే కృష్ణా నది ఒక సన్నని మార్గం (బెజ్జం) ద్వారా ముందుకు సాగుతుంది. ఈ కారణంగా ఆ ప్రదేశాన్ని తొలుత “బెజ్జం వాడ” అని పిలిచేవారు. కాలక్రమేణా అది “బెజవాడ”గా మారి, ఆ తరువాత “విజయవాడ”గా ప్రసిద్ధి చెందింది.

అర్జనుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందింది ఇక్కడేనట..
అర్జనుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందింది ఇక్కడేనట..

అర్జునుని తపస్సు..

బెజవాడ.. విజయవాడగా మారడానికి ఓ కారణముందని చెబుతారు. ఈ ప్రాంతంలో అర్జునుడు ఒక పర్వతంపై కూర్చుని పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ కఠోర తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అర్జనుడి భక్తికి ప్రసన్నమైన శివుడు అతనికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడట. ఆ తపస్సులో శివుడి మనసు గెలుచుకుని పాశుపతాస్త్రాన్ని సాధించినందున ఈ ప్రాంతానికి “విజయవాడ” అనే పేరు వచ్చిందని ఒక విశ్వాసం ఉంది.

Share this post with your friends