వర్ణ వినాయకుడు ఎక్కడ దొరికాడంటే..

c
గతంలో ఈ ఆలయం మీద శ్రీ వైష్ణవుల ఆధిపత్యంతో పాటు కేరళ ప్రభుత్వం అధికారం కూడా ఈ ఆలయం మీద ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలు విడిపోయాక ఈ ఆలయం తమిళనాడు పరిధిలోకి వెళ్లిపోయింది. దీంతో కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది. ఇక్కడి వినాయకుడి విగ్రహం ఎలా దొరికిందనేది తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న కేరళ పురం ప్రాంతాన్ని పరిపాలించిన రాజు గారు తీర్ధయాత్రలు చేయడం ఆరంభించారట.

వర్ణ వినాయకుడు ఎక్కడ దొరికాడంటే..
వర్ణ వినాయకుడు ఎక్కడ దొరికాడంటే..

అందులో భాగంగా రామేశ్వరం వెళ్లారట. అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తున్నారట. ఆ సమయంలో ఒక వినాయక విగ్రహం సముద్ర కెరటాలలో కొట్టుకు వస్తూ రాజుగారికి కనిపించిందట. ఆ విగ్రహాన్ని రాజుగారు రామేశ్వరం రాజుకి అప్పగించబోయారట. దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మం అని భావించారట. అందుకే రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని కేరళపురం రాజుకే ఇచ్చేశారట. దానితో పాటు మరొక మరకత గణపతిని సైతం బహూకరించాడని చెబుతారు. కేరళ పురం రాజుగారు ఆ రెండు విగ్రహాలను తన రాజ్యానికి తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు. అలా విఘ్నేశ్వరుడు కేరళపురానికి చేరాడు.

Share this post with your friends