తల్లులందరికీ ఆదర్శమూర్తిగా యశోదమ్మ..

చిన్ని కృష్ణుడు తన ఇంట్లోనే కాకుండా గోకులంలో ఇతర గోపికల ఇళ్లలో కూడా పాలు, పెరుగు, వెన్న దొంగతనం చేసి తాను తినడమే కాకుండా తన స్నేహితులకు సైతం పంచిపెట్టేవాడు. గోపికలంతా యశోదమ్మ దగ్గర మొరపెట్టుకున్నారు. కానీ వారి మాటను యశోదమ్మ నమ్మలేదు. పుత్ర ప్రేమతో వారితోనే వాదించింది. కానీ ఆ తరువాత నిజం తెలుసుకుని తన ప్రియ పుత్రుడిని రోలుకు కట్టేసి శిక్షించింది. పిల్లలపై ప్రేమ వారిని బాగుపరిచేలా ఉండాలి కానీ చెడిపోవడానికి కాదని యశోదమ్మ నిరూపించింది. చిన్ని కృష్ణుడి బాల్యమంతా చిలిపి పనులతోనే కొనసాగింది.

తల్లులందరికీ ఆదర్శమూర్తిగా యశోదమ్మ..
తల్లులందరికీ ఆదర్శమూర్తిగా యశోదమ్మ..

స్నేహితులతో పాటు గోపికలతోనూ ఆడుకునేవాడు. ఒంటరిగా కూర్చొని కన్నయ్య వేణువు వాయిస్తూ ఉంటే.. ఆ వేణుగానానికి గోకులంలో ప్రజలే కాకుండా పశుపక్షాదులంతా పరవశించి పోయేవారు. అలాగే సాందీపుని వద్ద విద్యాభ్యాసాన్ని చక్కగా కొనసాగించాడు. అలా చదువులోనూ మంచి ప్రతిభను కనబరిచాడు. యశోదమ్మ తన కుమారుడు ఇలానే ఉండాలని ఆంక్షలు పెట్టలేదు. తప్పు చేస్తే మందలించింది.. ఒప్పు చేస్తే ప్రోత్సహించింది. అదుపుతప్పుతున్నాడనుకున్న క్రమంలో క్రమశిక్షణ నేర్పించింది. పిల్లలు ఆదర్శవంతంగా పెరగాలని.. అభిరుచుల ప్రకారం నడుచుకుంటూనే వారికి విలువలు నేర్పాలని నిరూపించిన యశోదమ్మను తల్లులంతా ఆదర్శంగా తీసుకోవాల్సిందే.

Share this post with your friends