పద్మావతి, శ్రీనివాసుల వివాహం జరిపించిన వకుళమాత ఎవరంటే..

కన్నయ్యని కన్నతల్లి కన్నా మిన్నగా యశోదమ్మ పెంచి పెద్దచేసింది. కన్నయ్య కూడా తన తల్లికి పదునాలుగు భువన భాండములు చూపించాడు. యశోదమ్మ చూపించే ప్రేమను ఎంతో ఆనందంగా అనుభవించాడు. అదే సమయంలో శిక్షలను సైతం అలాగే స్వీకరించాడు. అయితే అంత అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నయ్య వివాహాన్ని యశోదమ్మ చూడలేకపోయింది. ఈ విషయమై ఆమె చింతిస్తుండగా.. యశోదమ్మకు కన్నయ్య వరమిచ్చాడు. అలా మరుజన్మలో వకుళమాతగా యశోదమ్మ జన్మించి శ్రీనివాసుడు కల్యాణాన్ని తన చేతుల మీదుగా పద్మావతి దేవితో జరిపించింది.

పద్మావతి, శ్రీనివాసుల వివాహం జరిపించిన వకుళమాత ఎవరంటే..
పద్మావతి, శ్రీనివాసుల వివాహం జరిపించిన వకుళమాత ఎవరంటే..

భగవంతుడు సైతం అలా తల్లి ప్రేమకు లొంగిపోయాడు. సాధారణ వ్యక్తులు లొంగడంలో విశేషమేముంది? కన్నయ్య పసిబిడ్డగా మారి తల్లి పొత్తిళ్లలో ఆడుకున్నాడు. అలాగే అనసూయదేవి ఒడిలో త్రిమూర్తులంతటి వారే పసిబిడ్డలుగా మారి మాతృ వాత్సల్యాన్ని చవిచూశారు. ఇక శ్రీరాముడైతే ఏకంగా ముగ్గురు తల్లుల ప్రేమను పొందాడు. శ్రీ కృష్ణుడు సైతం దేవకి, యశోదల ప్రేమలో తరించాడు. తల్లి ప్రేమను చవిచూసేందుకు భగవంతుడే పసిబాలుడిగా భూమిపైకి వచ్చాడు. మరి మనం ఒక లెక్కా? కాబట్టి మన పిల్లలకు సైతం అమ్మ ప్రేమను పొందే అదృష్టానికి వారసులుగా పెంచాలి. ప్రేమ చూపించే సమయంలో చూపించాలి. తప్పు చేస్తే దండించాలి. అప్పుడే పిల్లలు క్రమశిక్షణతో పెరుగుతారు.

Share this post with your friends