తులసీదాస్ మహత్స్యాన్ని తెలిపే ఘటన ఇది..

తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడంటూ ఎన్నో అభియోగాలను ఇతర మత పెద్దలు ఢిల్లీ పాదుషాకు పంపించేవారు. అలా తులసీదాస్ మహత్స్యాన్ని తెలిపే ఒక సంఘటన చోటు చేసుకుంది. వారణాసిలో నివసించే ఒక సద్బ్రాహ్మణుడు తన ఏకైక కుమారునికి కుందనపు బొమ్మలాంటి అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ చాలా ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. ఏమైందో ఏమో కానీ అ కస్మాత్తుగా ఆ యువకుడు మరణించాడు. ఆ అమ్మాయి భర్త మరణంతో తల్లడిల్లిపోయింది. మరోవైపు సదరు యువకుడి శవయాత్రకు అంతా సన్నాహాలు చేశారు. కానీ ఆ అమ్మాయి మాత్రం తన భర్త శవాన్ని తీసుకెళ్లకుండా అడ్డగించి రోదిస్తోంది.

తులసీదాస్ మహత్స్యాన్ని తెలిపే ఘటన ఇది..
తులసీదాస్ మహత్స్యాన్ని తెలిపే ఘటన ఇది..

ఈ క్రమంలోనే శవయాత్ర ముందుకు సాగింది. శ్మశానానికి వెళ్లే మార్గంలోనే తులసీదాస్ ఆశ్రమం ఉంది. యువకుని భార్య ధ్యానంలో ఉన్న తులసీదాస్ పాదాలపై పడి రోదిస్తుండగా.. ఆయన కళ్లు తెరచి చూసి దీర్ఘ సుమంగళీ భవ అని దీవించారట. అప్పుడు ఆ యువతి తన భర్త మరణించాడని.. తనకు తులసీదాస్ అందించిన దీవెన వ్యర్థమైందని రోదించసాగిందట. శ్రీరాముడే తన నోట ఆ మాట పలికించాడని.. వెళ్లి శవయాత్రాన్ని ఆపించి రామనామాన్ని జపిస్తూ తన కమండలంలోని పవిత్ర జలాన్ని శవంపై చల్లాడు. దీంతో ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడట. అది చూసిన వారంతా ఆశ్చర్యపోయారట. తులసీదాస్‌కు భక్తితో నమస్కరించారట. దీంతో తులసీదాస్ ఖ్యాతి మరింత విస్తరించి రామనామ జపం అన్ని వైపులకు పాకిందట.

Share this post with your friends