రామనామ దీక్షను తీసుకున్న తులసీదాస్‌పై అభియోగాలు..

శక్తి కోసం.. సమస్యల నుంచి బయటపడటం కోసం మనం హనుమంతుడిని ధ్యానించుకుంటూ ఉంటాం. అయితే ఆంజనేయుడి విశేషమైన స్త్రోత్రాలలో హనుమాన్ చాలీసా ముందు వరుసలో ఉంటుంది. దీనికి క్రమం తప్పకుండా పఠిస్తే దుష్టశక్తులు, ప్రతికూల శక్తుల నుంచి దైవిక రక్షణ లభిస్తుందని విశ్వాసం. ముఖ్యంగా శని దోషాలతో బాధపడే వారికి సైతం హనుమంతుడిని సేవిస్తే శని బాధలు తొలగుతాయట. అలాగే రాహు-కేతు దోషాల నుంచి సైతం విముక్తి లభిస్తుందని చెబుతారు. నిత్యం హనుమాన్ చాలీసా పఠిస్తే కలిగే లాభాలు అనేకం. మరి అంతటి విశిష్టమైన హనుమాన్ చాలీసాను రచించారు. తులసీదాస్ గురించి తెలుసుకుందాం.

రామనామ దీక్షను తీసుకున్న తులసీదాస్‌పై అభియోగాలు..
రామనామ దీక్షను తీసుకున్న తులసీదాస్‌పై అభియోగాలు..

నిత్యం రామనామాన్ని స్మరిస్తూ తులసీదాస్ ఆనందసాగరంలో తేలియాడుతూ ఉండేవాడు. అలా తులసీదాస్ విశిష్టమైన తపోబలాన్ని సాధించాడట. ఆయన ఎన్నో మహిమలను చూపేవారట. ఎందరో తులసీదాస్ ద్వారా రామనామ దీక్షను స్వీకరించారని చెబుతారు. ఇతర మతాలకు చెందిన వారు సైతం తులసీదాస్ కారణంగా రామనామ జపం చే సేవారట. దీంతో ఆయా మతపెద్దలకు అది కంటగింపుగా మారిందట. ఈ క్రమంలోనూ తులసీదాస్‌పై పలు రకాల ఆరోపణలు చేస్తూ ఢిల్లీ పాదుషా వారికి ఆయనపై అభియోగాలను పంపుతూ ఉండేవారట. అయినా కూడా తులసీదాస్ మాత్రం రామనామ జపం గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉండేవారు.

Share this post with your friends