దేవుడి గది తలుపులు రాత్రి వేళ ఎందుకు మూసివేయాలంటే..

హిందువులు తమ ఇళ్లలో తప్పనిసరిగా పూజగదిని ఏర్పాటు చేసుకుంటారు. అయితే పూజగదిని తలుపులు లేదంటే కర్టెన్‌ను తప్పనిసరిగా రాత్రివేళ మూసి ఉంచుతారు. ఇలా ఎందుకు చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. పూజ గది నిర్మాణానికి చాలా రూల్స్ పాటిసతారు. పూజ గది ఈశాన్య దిశకు ఎదురుగా ఉండాలట. ఈ దిశ సానుకూల ప్రవాహానికి నెలవట. అలాగే గది ఎత్తు కూడా కీలకమే. నేలకు కొంచెం పైన ఉండాలి. పూజ గది ఎంత చిన్నగా ఉన్నా కూడా నిత్య పూజలు అత్యంత ప్రధానం. పూజా మందిరాన్ని నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలి.

పూజ గదికి తలుపులు లేదంటే కర్టెన్ అలంకరణ కోసం మాత్రమే కాదు. రాత్రి వేళ దేవతలు విశ్రాంతి తీసుకుంటారట. రాత్రిపూట దేవతలు ఏకాంతాన్ని కోరుకుంటారట. అందుకే దేవతలకు ఎలాంటి డిస్ట్రర్బెన్స్ లేకుండా ఉండేందుకు తలుపులు లేదంటే పరదాలు వేస్తారు. పూజ గది తలుపులు మూసివేయడం దేవతలకు గౌరవాన్ని ఇవ్వడం అని కూడా అంటారు. అలాగే పూజ గదికి సమీపంలో గోవు పంచకం, గంగాజలం వంటివి ఉంచాలంటారు. ఎప్పుడైనా అపవిత్రమైనట్టుగా అనిపిస్తే పూజగదితో పాటు పరిసరాలను శుభ్రం చేసి గోవు పంచకం చల్లాలి.

Share this post with your friends