హనుమంతునికి మంగళ, శనివారాలు ఎందుకు ఇష్టం?

మంగళవారం కుజగ్రహానికి ఆధిపత్యం కలిగిన రోజు. అలాగే వినాయకుని కూడా ఆరోజే అర్చిస్తారు. భూలోకం నుంచి సత్యలోకం వరకు ఆంజనేయుడు అధిపతి. అతల నుంచి పాతాళం వరకు వినాయకుని ఆధిపత్యంలోనివి. అందుకనే కలౌ గణేశమారుతీ అని చెబుతారు. ఆంజనేయునిలాగే వినాయకుడు కూడా సుందరుడే. ఆంజనేయుడు సిందూర వర్ణప్రియుడు. వినాయకుడు కూడా అంతే. ఇద్దరూ వనచరప్రియులే. అలా వారిద్దరికీ ముప్పైరెండు సారూప్యాలున్నాయి.

కుజగ్రహ, రాహుగ్రహ దోషాలు పోవడానికి కూడా ఆంజనేయుని ప్రార్ధిస్తారు. ఇక శనివారం నాడు కూడా హనుమంతుని పూజస్తారు. శనిదోషం వల్ల తెలియని బాధలు కలుగుతాయి. నిద్రలేమి, నిష్కారణ నింద, అనవసరపు ఆలోచనలు పెరగడం వంటివన్నీ శనిగ్రహ దుష్ప్రభావాలు. ఇవన్నీ పోవడానికే హనుమంతుని మంగళ, శనివారాల్లో పూజించే సంప్రదాయం వచ్చింది.

Share this post with your friends