యమ స్థానం ఎటువైపు? కుబేర స్థానం ఎటు వైపు?

ఇల్లు నిర్మించుకోవాలనే తపన ఉంటే సరిపోదు. ఏ గది ఎటు వైపు ఉండాలో ముందే నిర్ణయించుకుని ఆ ప్రకారమే కట్టుకోవాలి లేదంటే ఇబ్బందులు తలెత్తే అవకాశముందని అంటుంటారు. పూజగది, వంటగది, బెడ్‌రూమ్స్ వంటివి ఏ స్థానంలో ఉండాలో అదే స్థానంలో ఉండాలి. యమ స్థానం ఎటు వైపు ఉంటుంది? కుబేర స్థానం ఎటు వైపు ఉంటుందో చూద్దాం. ఈశాన్యంలో పూజలు, పవిత్ర కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. అంటే పూజగది పక్కాగా ఈశాన్యంలో ఉండాలి. ఆగ్నేయంలో అగ్నికి సంబంధించిన పనులు నిర్వర్తించుకోవాలి. కాబట్టి ఆగ్నేయంలో వంటగదిని ఏర్పాటు చేసుకోవాలి.

అన్నింటికంటే గృహంలో ప్రధాన భాగం పడకగది కాబట్టి ఇది ఎప్పుడూ నైరుతి దిక్కునే ఉండాలి. నైరుతి వైపుంటే స్థిరత్వంతో పాటు అంతర్భాగంలో శక్తి చేకూరుతుంది కాబట్టి పడకగదికి నైరుతి సరియైనది. ఇక దక్షిణం వైపును యమ స్థానం అంటారు. ఈ దిక్కున పడుకుంటే చావుకి ఎదురెళ్లినట్టే అంటారు. అలాగే ఉత్తరం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ తలపెట్టి పడుకోకూడదు. తూర్పు దిక్కును ఇంద్ర స్థానం, కుబేర స్థానం అంటారు. ఇంద్రుడు దేవతల అధిపతి కాబట్టి ఇది దేవతల దిక్కు. ఈ దిక్కులో నిద్రించడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఈ దిక్కువైపు తలపెట్టి నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందట. ఈ విధంగా ఇంటి నిర్మాణం చేసుకుంటే.. అన్ని దిక్కులలోని ఉన్న దేవతలు సంతృప్తి చెందుతారట.

Share this post with your friends