నాగ పంచమి ఎప్పుడు? ఆ రోజున నాగదేవతను ఆరాధిస్తే ఏం జరుగుతుంది?

నాగపంచమిని హిందువులు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఇది శ్రావణ మాసంలో వస్తుంది. శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున మనమంతా హిందువుల ప్రధాన పండుగలలో ఒకటైన నాగపంచమిని జరుపుకుంటూ ఉంటాం. ఈరోజున పూజ చేసుకుంటే కాలసర్ప దోష విముక్తి కలుగుతుందట. మరి ఈ ఏడాది నాగ పంచమి ఎప్పుడు అంటారా? ఆగస్ట్ 9వ తేదీన. ఈ రోజున నాగదేవతకు పూజ చేసుకుంటే చాలా మంచిదని నమ్మకం. పంచమి తిథి ఆగస్టు 9వ తేదీ ఉదయం 8:15 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6:09 గంటలకు ముగుస్తుంది. కాబట్టి మనం 9వ తేదీనే నాగ పంచమిని జరుపుకుంటాం.

ఇక పూజకు అనుకూలమైన సమయం ఎప్పుడంటే.. ఆగస్ట్ 9 మధ్యాహ్నం 12:13 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకూ.. అలాగే సాయంత్రం 6:33 నుంచి 8:20 గంటల వరకు పూజించుకోవచ్చు. ఈ సమయంలో నాగదేవతను పూజిస్తే ఫలితం మరింత బాగుంటుందట. ప్రదోష కాలంలో ఈ రోజున నాగదేవతను ఆరాధించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆ రోజున నాగదేవతను పూజిస్తే నాగదోషం తొలగిపోవపడంతో పాటు వైవాహిక జీవితంలో సమస్యలు లేదా సంతానం కలగడంలో సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే నాగదేవతను పూజిస్తే శివుడి అనుగ్రహం కూడా లభిస్తుందట.

Share this post with your friends