గోళ్లు కొరికినా.. కూర్చొని కాళ్లూపినా ఆయనకు అసలు నచ్చదట..

కొన్ని పనులు మనం చేస్తుంటే పెద్దవారు చేయవద్దని సూచిస్తూ ఉంటారు. గోళ్లు కొరకడం, కూర్చొని కాళ్లూపడం వంటివి అస్సలు చేయనివ్వరు. దీనికి కారణం లేకపోలేదు. వాస్తవానికి శనీశ్వరుడు ఇలాంటి వాటిని ఏమాత్రం ఉపేక్షించడట. గోర్లు తినే అలవాటుంటే శనీశ్వరుడు అస్సలు మెచ్చడట. శుభ దృష్టితో చూడడట. పెద్దలను అవమానించడం వంటివి చేస్తే శనీశ్వరుడితో పాటు మిగిలిన దేవతలెవరూ సంతోషించరట. ఇలాంటి వ్యక్తులు జీవితంలో ఎన్నో బాధలను ఎదుర్కొంటారని చెబుతారు.

వంటగదిని మురికిగా ఉంచితే లక్ష్మీదేవి అక్కడ అస్సలు ఉండదట. అలాగే శనీశ్వరుడికి కూడా కోపం వస్తుందట. కాళ్లను ఈడుస్తూ నడిచినా కూడా శనీశ్వరుడికి నచ్చదట. దీంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతారట. కొంతమంది కాళ్లు తెగ ఊపేస్తూ ఉంటారు. ఇది చాలా అశుభమని పెద్దలు భావిస్తూ ఉంటారు. ఈ అలవాటు శనిదేవునికి కోపం తెప్పిస్తుందట. అప్పు తీసుకుని ఎగ్గొట్టినా కూడా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందట. డబ్బు ఇవ్వని వ్యక్తులు శనీశ్వరుడి చెడు దృష్టి నుంచి తప్పించుకోలేరట. కాబట్టి వీలైనంత త్వరగా డబ్బు తిరిగి ఇవ్వాలట.

Share this post with your friends