కుమారస్వామికి చెందిన ఆరు ప్రముఖ క్షేత్రాలు ఎక్కడున్నాయంటే..

ద్వాదశ జ్యోతిర్లింగాలని.. పంచారామాలని.. అష్టాదశ శక్తిపీఠాల గురించి నిత్యం ఏదో ఒక సందర్భంలో తెలుసుకుంటూనే ఉంటాం. ఈ విధంగానే కుమార స్వామికి కూడా ఆరు ముఖాలు ఉంటాయట. ఆరు అనే నంబరే స్వామివారికి ప్రతీకగా భావిస్తుంటారు. దీనికి కారణం కుమారస్వామిని ఆరుగురు అక్కచెల్లెళ్లు పెంచడమేనని అంటారు. ఆయనకు క్షేత్రాలు చాలానే ఉన్నాయి. కానీ వాటిలో ఆరు మాత్రం అత్యంత మహిమాన్వితమైనదట. ఈ ఆరు క్షేత్రాలను తమిళంలో ‘ఆరు పడై వీడు’ అని పిలుస్తారు. ఆ ఆరు క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

తిరుపరన్కుండ్రం : ఆరు పైడైవీడులో తొలి క్షేత్రమే తిరుపరన్కుండం. ఇది మధురై ఊరి పొలిమేరలో ఉంది. ఇక్కడ మధుర మీనాక్షిని దర్శించుకునేందుకు వెళ్లే వారు తప్పక ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక్కడే స్వామివారు దేవసేనను వివాహమాడారట.

తిరుచెందూరు: స్వామివారి ఆరు ఆలయాల్లో సముద్ర తీరాన ఉన్న ఏకైక ఆలయం. తిరువన్వేలి, కన్యాకుమారి వంటి ప్రసిద్ధ క్షేత్రాలకు ఈ ఆలయం కాస్త దగ్గరగానే ఉంటుంది. ఇక్కడ శూరపాదం అనే రాక్షసునిపై కుమారస్వామి విజయం సాధించాడట.

తిరుత్తణి : రాక్షసులతో యుద్ధం ముగిసిన తర్వాత తిరుత్తణిలో కుమారస్మామి సేదతీరాడట. ఇక్కడే స్వామివారికి వల్లీదేవితో వివాహం జరిగిందట. .

పళమూడిర్చోళై : మధురై నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల మధ్య ఓ చిన్న కొండ మీద స్వామివారి క్షేత్రం ఉంటుంది. ఇక్కడ స్వామివారు వల్లీదేవసేన సమేతుడై కనిపిస్తాడు.

పళని: ఇది తెలుగు వాళ్లందరికీ సుపరిచితమైన ప్రదేశమే. తమిళనాడులోని దిండుగల్ జిల్లా పళని కొండలో చిన్న కొండపై కుమారస్వామి చేతిలో దండం పట్టుకుని కనిపిస్తారు. ఇక్కడ స్వామివారు దండంతో కనిపిస్తారు కాబట్టే ‘దండాయుధపాణి’ అని కూడా పిలుస్తారు. ఇక్కడి స్వామివారి విగ్రహాన్ని తొమ్మిది రకాల లోహాలతో రూపొందిస్తూ ఉంటారు.

స్వామిమలై : తమిళనాడులోని కుంభకోణం అనే ఊరుకి అతిసమీపంలో స్వామిమలై ఉంటుంది. ఈ ప్రాంత విశేషం ఏంటంటే. సాక్షాత్తు తండ్రి శివయ్యకే కుమారస్వామి ఓంకారం తెలియజేశాడట.
అందమైన ప్రకృతి నడుమ, వల్లీదేవసేన సమేతంగా ఉన్న ఇక్కడి స్వామివారిని చూడటం ఓ దివ్యమైన అనుభూతి అంటారు భక్తులు.

Share this post with your friends