శని జయంతి ఎప్పుడు? శని దేవుడి మంత్రాంలేంటి?

శని జయంతి గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. వైశాఖ మాసంలోని అమావాస్య రోజున సూర్యుడు, ఛాయాదేవిల తనయుడైన శనీశ్వరుడు జన్మించాడు. కాబట్టి వైశాఖ మాసం అమావాస్య రోజున మనం శని జయంతి జరుపుకుంటూ ఉంటాం. అది ఎప్పుడంటే ఈ నెల 6వ తేదీ. ఈ రోజున శనీశ్వరుడికి పూజ చేస్తే మనకు శని దోషం ఉంటే తొలిగిపోతుందట. మరి రేపు శనీశ్వరుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? శని దేవుడిని ఎలా పూజిస్తే ఆయన సంతోషిస్తాడు? కొన్ని శని మంత్రాలను చూద్దాం.

శని గాయత్రీ మంత్రం:ఓం ఖగథ్వజాయ విద్మహే ఖడ్గ, హస్తాయ ధీమహి తన్నో మందః ..ప్రచోదయాత్| ఓం శనైశ్వరాయ విద్మహే.. సూర్య పుత్రాయ ధీమహి తన్నోః మందః ప్రచోదయాత్

శక్తివంతమైన శని మంత్రం:ఓం శం శనిశ్చారాయ నమః ఓం శంనో దేవీరభీష్ట అపో భవన్తుపితయే|ఓం శం శనైశ్చరాయ నమః ఓం సూర్య పుత్రాయ నమః

శని దేవుని భీజ మంత్రం:ఓం ప్రాం ప్రిం ప్రాణ నః.. శనిశ్చరాయ నమః

శని దోష నివారణ మంత్రం: శన్యారిష్టే తు సంప్రాస్తే శని పూజాంచ కారయేత్| శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణి పీడోపశాంతయే

శని ఆరోగ్య మంత్రం:ధ్వఝినీ ధామినీ చైవ కంకాలీ కలహపృహా |కాంక్తి కలహి చౌఠ తురంగి మహిషి అజా.. శనర్ణమణి భార్యనామేతాని సంజపన్ పుమాన్ దుఖాని నశ్యేన్నిత్యం సౌభాగ్యమేధతే సుఖమ్

శని శాంతి మంత్రం: క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్| ఛాయామార్తాండ సంభూతం నమస్వామి శనైశ్చరమ్, నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార.. వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ| ఓం సూర్య పుత్రాయ నమః ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ.. క్రిష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కృరాయ|శుద్ధబుద్ధి ప్రదాయనేయ ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్|మదీయం తు భయం తస్య స్వప్నేసి న భవిష్యతి

శని పౌరాణిక మంత్రం:ఓం హ్రీం నీలాఞ్జనసమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ ఛాయా మార్తాండసంభూతం తాన్ నమామి శనశ్చరమ్

శని వేద మంత్రం: ఓం షన్నోదేవీర్-భీష్టాయ, ఆపో భవన్తు పీఠే శయ్యోర్భిస్త్రవంతునః

Share this post with your friends