వరద వినాయకుడు అక్కడ స్వయంభువుగా వెలవడం వెనుక కథేంటంటే..

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా కర్జాత్ సమీపంలోని ఖలాపూర్ తాలూకాలో ఉన్న మహ్ద్ గ్రామంలో అష్ట వినాయక దేవాలయంలోని నాలుగవ దేవాలయంలో వినాయకుడు స్వయంభువుగా వెలిసిన విషయం తెలిసిందే. ఈ వినాయకుడిని వరద వినాయకుడని పిలుస్తారు. ఇక ఈ వినాయకుడి స్థల పురాణం ఏంటే.. ఈ పూర్వం ఈప్రాంతాన్ని రుక్మాంగదుడనే రాజు పరిపాలించాడు. ఆ రాజు ఒకరోజు వేటకు వెళ్లి దాహార్తి తీర్చుకోవడం కోసం ఓ ముని ఆశ్రమానికి వెళతాడు. ఆ ముని అప్పుడే నదీ స్నానానికి వెళతాడు. మునిపత్ని అయిన ముకుంద రుక్మాంగదుడిని చూసి మోహిస్తుంది. కానీ రుక్మాంగదుడు ఇంద్రియ నిగ్రహం కలవాడు కావడంతో మునిపత్నిని తిరస్కరిస్తాడు. ఆగ్రహించిన మునిపత్ని కుష్టు వ్యాధి గ్రస్తుడిగా జీవించమని శపిస్తుంది. శాపగ్రస్తుడైన రుక్మాంగదుడు గణేషుడిని ధ్యానించి శాప విమోచనం పొందుతాడు. అయినా సరే ముకుందకు రుక్మాంగదుడిపై మోహం తీరదు. విషయం గమనించిన ఇంద్రుడు రుక్మాంగదుని రూపంలో వచ్చి ఆమె కోరికను తీరుస్తాడు.

తత్ఫలితంగా ముకుందకు మగబిడ్డ జన్మిస్తాడు. అతనికి గృత్స్నమదుడు అని పేరుపెడతారు. ఒకరోజు మునులకు ఆధ్యాత్మిక వాదం జరుగక గృత్స్నమదుడు పాల్గొంటాడు. అతను పాల్గొనడానికి వీల్లేదని అతని మునుపుత్రుడు కాదని అంతా చెప్పడంతో తల్లిని నిలదీస్తాడు. అప్పుడు తల్లి రాజుకు పుట్టావని చెబుతుంది. కోపంతో గృత్స్నమదుడు.. తల్లిని శపిస్తాడు. తల్లి తిరిగి రాక్షస కుమారుడిగా జన్మిస్తావని శపిస్తుంది. అంతలో ఆకాశవాణి గృత్స్నమదుడు ఇంద్రుడి పుత్రుడని చెప్పడంతో ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఆ తరువాత గృత్స్నమదుడు విఘ్నేశ్వరుని ధ్యానిస్తూ ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు గణేవుడు ప్రత్యక్ష్యమై గొప్ప వేద బ్రాహ్మణుడవుగాకీర్తిని సంపాదిస్తావని వరమిస్తాడు. దీంతో వినాయకుడిని అక్కడే ఉండిపోవాలని కోరగా ఆయన అక్కడ స్వయంభువుగా వెలిశాడు. గృత్స్నమదుడు వినాయకునికి ఆలయమును నిర్మించి వినాయక మూర్తిని అందులో ప్రతిష్ఠించాడు. అదీ ఆలయ కథ.

Share this post with your friends