హిందూమతంలో కొన్ని తిథులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. వారంలో దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక దేవుడికి అంకితం చేయబడింది. అలాగే తిథుల్లో చతుర్థి వచ్చేసి వినాయకుడికి అంకితం చేయబడింది. ఒక్క చతుర్థి మాత్రమే కాదు.. ప్రతి నెల శుక్ల పక్షం కూడా గణేషుడికే అంకితం. జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్ల పక్ష చతుర్థి తిథిని వినాయక చతుర్థి అంటారు. వినాయక చతుర్థి రోజున గణపతిని పూజించుకుంటే సకల విఘ్నాలు తొలిగిపోతాయని నమ్మకం. ఇక వినాయక చతుర్థి గురించి తర్వాత చర్చించుకుందాం. ఈ నెలలో సంకష్టి చతుర్థి పూజ విషయంలో అయితే కొంతమేర గందరగోళం నెలకొంది. కాబట్టి దాని ఖచ్చితమైన తేదీ, శుభ సమయం గురించి తెలుసుకుందాం..
జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి జూన్ 9న మధ్యాహ్నం 3.44 గంటలకు ప్రారంభమై.. జూన్ 10 సాయంత్రం 04:14 గంటలకు జ్యేష్ఠ మాస శుక్ల పక్ష చతుర్థి తిథి ముగుస్తుంది. దీని ప్రకారం సంకష్టి చతుర్థి వ్రతం ఎప్పుడంటే జూన్ 10, 2024న మాత్రమే చేయాలట. సంకష్టి చతుర్థి చంద్రోదయం- చంద్రాస్తమయం సమయం వచ్చేసి… 2 గంటల 47 నిమిషాలకు. సంకష్టి చతుర్థి చంద్రాస్తమయం సమయం రాత్రి 10:54. ఇక వినాయకుడిని పూజించేందుకు కూడా ఇదే సరైన సమయం. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి శుచిగా స్నానమాచరించాలి. అనంతరం పూజా పీటంపై ఎర్రటి బట్ట పరచి దానిపై వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి గంగాజలంతో స్నానం చేయించి.. పసుపు, కుంకుమ, గంధపు తిలకం దిద్దాలి. అనంతరం గణపతికి పూల దండను.. మోదకం సమర్పించి.. దేశీ నెయ్యితో దీపం వెలిగించాలి. గణపతి పూజ అనంతరం హారతి ఇవ్వాలి. దీంతో పూజ ముగుస్తుంది.