కేతు దోషానికి ప్రతి శనివారం ఏం చేయాలంటే..

జాతకంలో కేతు దోషం ఉంటే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదట. వాస్తవానికి మనిషి జీవితం గ్రహాలపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతారు. ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారమైతే కేతువును పాప గ్రహంగా భావిస్తారు. ఈ దోషం ఉన్న వ్యక్తం చెడు అలవాట్ల బారిన పడతాడు. ఏ పనీ సవ్యంగా సాగక జీవితమంతా సమస్యలమయమవుతుందట. కాబట్టి వీలైనంత త్వరగా కేతు దోషాన్ని వదిలించుకోవాల్సిందే. మరి దీన్ని వదిలించుకోవడానికి ఏం చేయాలి? కేతువుకు కారణం శ్రీ గణేషుడని భావిస్తూ ఉంటారు కాబట్టి ఆ స్వామి వారిని పూజిస్తే సరిపోతుంది. ముఖ్యంగా బుధవారం రోజున గణేషుడిని పూజిస్తే కేతు దోషం నుంచి విముక్తి లభిస్తుందట.

జాతకంలో కేతు దోషం ఉందని తెలుసుకున్న వ్యక్తి.. ముందుగా ఈ దోషం పోవాలంటే 18 శనివారాల పాటు ఉపవాసం ఉండాలి. అలాగే ‘ఓం ప్రాణ్ ప్రీం ప్రౌన్ సహ కేత్వే నమ:’ అనే మంత్రాన్ని 5, 11 లేదా 18 సార్లు జపించాలి. తద్వారా కేతు గ్రహ ప్రభావం కొంత మేర తగ్గుతుందట. ప్రతి శనివారం రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి దుప్పటి, గొడుగు, ఇనుము, ఉసిరి, వెచ్చదనం ఇచ్చే వస్త్రాలు, కస్తూరి, వెల్లుల్లి మొదలైన వాటిని దానం చేయడం వలన ఫలితం ప్రభావవంతంగా ఉంటుందట. అలాగే వైఢూర్య రత్నాన్ని ధరించడం ద్వారా కేతు గ్రహ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చట. ప్రతిరోజూ నువ్వులను నీటిలో వదిలినా కూడా కేతు దోషం నుంచి బయటపడవచ్చట.

Share this post with your friends