జూన్ నెలలో తిరుమలలో ఏ ఏ వేడుకలు జరగనున్నాయంటే..

తిరుమలలో ప్రతి నెలలో ఏవో ఒక ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. మరి జూన్ నెలలో ఏ ఏ కార్యక్రమాలు జరగనున్నాయనే వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

జూన్ వేడుకలు..

జూన్ 1-5: ఆకాశ గంగ అంజనాద్రి-బాలాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు

జూన్ 2 : మహి జయంతి

జూన్ 19-21: వార్షిక అభిధ్యేయక లేదా జ్యేష్ఠాభిషేకం

జూన్ 20: శ్రీ నాధముని వర్ష తిరు నక్షత్రోత్సవం

జూన్ 22: పౌర్ణమి గరుడ సేవ

కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వేసవి సెలవులతో పాటు విద్యార్థులకు పరీక్షల ఫలితాలు రావడం.. ఎన్నికలు ముగియడంతో శ్రీవారి దర్శనానికి భక్తులతో తిరుమల పోటెత్తుతోంది. దీంతో శ్రీవారి దర్శనానికి 24 గంటల పైనే సమయం పడుతోంది. ఈ క్రమంలోనే వీఐపీ బ్రేక్ దర్శనాన్ని సైతం టీటీడీ నిలిపివేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ స్పెషల్ దర్శన టికెట్లను విడుదల చేయగా.. విడుదలైన గంటన్నరలో 4 లక్షల 65 వేల టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు.

Share this post with your friends