వేంకటేశ్వర స్వామివారికి తలనీలాలు సమర్పించడం వెనుక కథేంటి?

శ్రీహరిపై కోపంతో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడిన అనంతరం లక్ష్మీదేవిని వెదుక్కుంటూ ఆయన భూలోకానికి వచ్చారు. ఓ పుట్టలో నివాసం ఏర్పచుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అయితే వేంకటేవ్వరుని ఆకలి తీర్చేందుకు ఓ గోవు అక్కడకు వచ్చి పాల ధారను కార్చేది. ఆవు పాలు ఏమవుతున్నాయో తెలియని దాని యజమాని.. పుట్టలోని వ్యక్తి పాలు తాగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడ ఉన్నది సాక్షాత్తూ భగవంతుడని తెలుసుకోలేక అజ్ఞానంతో గొడ్డలితో శ్రీనివాసుని తలపై గాయపరుస్తాడు. స్వామివారి తలకు గాయపై రక్తం కారుతుండగా.. నీల అనే భక్తురాలు ఆయన నుదుటికి పసరు రాసి సపర్యలు చేసింది.

వేంకటేశ్వర స్వామికి గాయమైన చోట తల వెంట్రుకలు తొలగిపోయాయి. దీంతో నీల తన తల వెంట్రుకలను తీసి స్వామివారికి వెంట్రుకలు తొలగిపోయిన చోట అతికించింది. నీల భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు తిరుమలలో వెలిసిన అనంతరం తనకు భక్తులు సమర్పించే తలనీలాలన్నీ ఆమెకే చెందుతాయని వరమిచ్చాడు. అప్పటి నుంచి స్వామివారికి భక్తులు తలనీలాలు సమర్పించడం జరుగుతోంది. వాస్తవానికి మంగళవారం, శుక్రవారం, శనివారం క్షవరం చేయించుకోకూడదు. కానీ తిరుమలలోని కల్యాణ కట్టలలో నిత్యం అలాగే 24 గంటలూ సమర్పిస్తూ ఉంటారు. వేంకటేశ్వర స్వామివారికి మొక్కుకుని భక్తితో తలనీలాలు సమర్పిస్తే మన పాపాలన్నీ పోతాయని నమ్మకం.

Share this post with your friends