సనాతన ధర్మంలో దీపం వెలిగించకుండా ఏ పూజా సంపూర్ణంగా పరిగణించబడదు. ఈ సంప్రదాయం ఈనాటిది కాదు.. శతాబ్దాలుగా హిందూ ధర్మంలో ఉంది. దీపం వెలిగించడం వల్ల వాతావరణమంతా సానుకూలంగా మారిపోతుందని నమ్మకం. భగవంతుని ఎదుట సందర్భాన్ని బట్టి మట్టి, పిండి దీపాలను వెలిగిస్తూ ఉంటారు. కొన్ని ప్రత్యే క సందర్భాల్లో పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అసలు ఎన్ని పిండి దీపాలున్నాయి? భగవంతుని వద్ద పిండి దీపాలను వెలిగించడం వల్ల ఏం జరుగుతుంది? వంటి అంశాలను తెలుసుకుందాం. గోధుమ పిండి, మినప పిండి, పెసర పిండి, బియ్యపు పిండి దీపాలను వెలిగిస్తూ ఉంటారు.
గోధుమ పిండి దీపం వెలిగించడం వలన అనుకోకుండా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుని దాని నుంచి బయటపడాలనుకుంటే.. గోధుమ పిండి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆ వివాదం త్వరగా తొలగిపోతుంది. ఇక పెసరపిండి దీపాన్ని వెలిగిస్తే ఇంట్లో పేదరికమంతా పోయి సుఖశాంతులు నెలకొంటాయి. శత్రువపై గెలవాలన్నా.. అతడిని అధిగమించాలన్నా మినప పిండితో చేసిన దీపాన్ని వెలిగించాలట. బియ్యపు పిండితో చేసిన దీపాలను వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే.. ప్రతీరోజూ లక్ష్మీదేవి ముందు పిండి దీపం వెలిగించాలని పండితులు చెబుతారు. జాతకంలో రాహు-కేతు దోషాలు తొలగిపోవాలంటే పూజగదిలో పిండి దీపం వెలిగించాలట.