తిరుమల శ్రీవారి గడ్డానికి ఏమైంది? ఎందుకు పచ్చ కర్పూరం రాస్తారు?

తిరుమల శ్రీవారికి నిత్యం గడ్డం కింద పచ్చ కర్పూరం రాస్తూ ఉంటారు. దీనికి ఓ కథ ఉంది. అనంతాళ్లారు అనే వ్యక్తికి శ్రీ వేంకటేశ్వరస్వామి అంటే అమితమైన భక్తి. ఆయన శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసిస్తూ ప్రతిరోజూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. స్వామివారి కోసం ఆయన ఒకరోజను ఒక పూలతోటను పెంచాలని భావిస్తాడు. ఈ తోటకు సరిపడా నీటి కోసం ముందుగా చెరువును తవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఎవరి సాయమూ తీసుకోకుండా అనంతాళ్లారు దంపతులిద్దరూ చెరువు తవ్వడం ఆరంభిస్తారు.

అయితే అనంతాళ్వారు భార్య నిండు చూలలు. అయితే సరే భర్త మట్టిని తవ్వితే.. ఆమె గంపలో తీసుకెళ్లి పడేసేది. దీనిని చూసి వేంకటేశ్వరస్వామి వారికి సాయం చేయాలనకుంటాడు. బాలుని రూపంలో అక్కడకు వచ్చి ఆమె గర్భినిగా ఉంది కాబట్టి ఆ మట్టి తాను పారబోస్తానని చెప్పి అలాగే పారబోయడం ప్రారంభించాడు. భార్య మట్టితట్టను తీసుకెళ్లి క్షణాల్లో రావడాన్ని గమనించిన అనంతాళ్లరులు ఏమైందని ప్రశ్నిస్తాడు. తనకు ఒక బాలుడు సాయం చేస్తున్నాడని చెబుతుంది. ఆగ్రహించిన అనంతాళ్వారులు గునపాన్ని బాలుడి మీదకు విసరగా గడ్డానికి తగిలి రక్తం వస్తుంది. ఆ తరువాత బాలుడు మాయమవుతాడు. ఇంతలోనే ఆలయంలోని స్వామివారి గడ్డానికి రక్తం కారడాన్ని గమనించిన అర్చకులు అనంతాళ్వారుకు చెబుతారు. అక్కడకు వెళ్లిన అనంతాళ్వారుకు బాలుడి రూపంలో వచ్చింది స్వామివారేనని అర్థమవుతుంది. క్షమించమని వేడుకుని గడ్డానికి పచ్చకర్పూరం అద్దుతాడు. నాటి నుంచి స్వామివారికి పచ్చ కర్పూరం రాయడం ఆనవాయితీగా మారిపోయింది.

Share this post with your friends