శ్రీరామ పట్టాభిషేకం రోజున అప్పట్లో అయోధ్యలో ఏం జరిగిందంటే..!

పధ్నాలుగేళ్ల అరణ్యవాసం తరువాత సీతారాములు అయోధ్యకు తిరిగి వచ్చారు. అన్నను చూడగానే భరతుడు పరుగు పరుగున వెళ్లి అన్నగారి పాదాలకుక పాదుకలు తొడిగాడు. ఇక రాజ్యాన్ని పాలించేందుకు సకల అర్హతలు కలిగిన నీవు.. మన తండ్రిగారి మాట కోసం రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలి వెళ్లిపోయావు. ఇక ఈ రాజ్యం నీది. రాజ్యపాలనకు అర్హుడివి నీవు కాబట్టి నీ పాదాల చెంత రాజ్యాన్ని పెడుతున్నానని భరతుడు చెప్పాడు. దీంతో రామయ్య కూడా భరతుడి మాటలకు సంతోషించి రాజ్య పాలన స్వీకరించేందుకు అంగీకరించాడు.

అనంతరం రామయ్య తండ్రి మంగళ స్నానాదులు పూర్తి చేసుకున్నాడు. సీతమ్మ తల్లి కూడా అందంగా ముస్తాబైంది. సుగ్రీవుడితో కలిసి వానర సైన్యమంతా వెంటరాగా.. సీతారాములు సూర్యమండల సన్నిభమైన రథంపై అయోధ్యకు బయలుదేరారు. భరతుడు రథసారధిగా ఉన్నాడు. లక్ష్మణుడు తన సోదరుడైన రాముల వారికి తెల్లని గొడుకు పట్టాడు. ఒక పక్క శత్రుఘ్నుడు.. మరోపక్క విభీషణుడు వింజామర వీస్తుండగా.. మంగళ వాయిద్యాల నడుమ రఘురాముడు అయోధ్యకు చేరుకున్నాడు. వశిష్ఠుడు, జాబాలి, కశ్యపుడు, గౌతముడు వంటి రుషులంతా పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేశారు. ఇక వానరాలు 4 సముద్ర జలాలు, 500 నదుల జలాలను తీసుకురాగా.. వాటిని రాముడిపై పోసి రాముడి సిరస్సున కిరీటం పెట్టారు. అలా నాడు శ్రీరామ పట్టాభిషేకం జరిగింది.

Share this post with your friends