రుద్రాక్షలో రకాలెన్ని? అవి ఎవరి స్వరూపమో తెలుసా?

రుద్రాక్షలో ఒకటి కాదు.. 15 రకాలు ఉన్నాయి. వాటిలో ఏది ఎవరి స్వరూపమో తెలుసా? ఏకముఖి నుంచి గౌరీశంకర రుద్రాక్ష వరకూ 15 రకాల రుద్రాక్షలున్నాయి. రుద్రాక్షను రుద్రుడి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. మళ్లీ ఈ 15ను ఒక్కోటి ఒక్కో దేవుడి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. ఏకముఖి అనేది స్వయంగా బ్రహ్మ స్వరూపం. ఏకముఖి ఎక్కడ ఉంటుందో అక్కడ తప్పక లక్ష్మి ఉంటుందట. ద్విముఖి అనేది సాక్షాత్తు అర్థనారీవ్వర స్వరూపం. త్రిముఖిని అగ్నిస్వరూపంగా భావిస్తూ ఉంటారు. ఈ త్రిముఖి రుద్రాక్షను ధరించడంతో సంపద, తేజస్సు, ఆత్మబలం వృద్ధి చెందుతాయట. చతుర్ముఖి రుద్రాక్ష కూడా బ్రహ్మ స్వరూపమే. ఇది ధర్మార్థ కామమోక్షాలు అనే నాలుగు పురుషార్థాలను ప్రసాదిస్తుంది.

పంచముఖి అనేది రుద్ర స్వరూపమట. ఇది కోరికలు తీర్చి, సమస్త పాపాలను హరించి మోక్షం ప్రసాదిస్తుంది. 108 రుద్రాక్షలతో కూడిన మాలను ధరిస్తే విశేష ఫలం లభిస్తుంది.షణ్ముఖి కార్తికేయుని స్వరూపం. దీనిని కుడిభుజానికి ధరిస్తే బ్రహ్మహత్యలాంటి మహాపాపాల నుంచి కూడా పరిహారం లభిస్తుందట. సప్తముఖి అనేది సప్తఋషి స్వరూపం. సప్తముఖిని కంఠంలో లేదా కుడిభుజానికి ధరిస్తే.. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుందట. అష్టముఖిని అష్టభుజాదేవి స్వరూపంగా చూస్తారు. ఇది సంపూర్ణ ఆయుష్షును అందిస్తుందట. నవముఖి అనేది ఇది నవదుర్గా స్వరూపం. సిరిసంపదల ప్రసాదిస్తుందట. దశముఖి అనేది సాక్షాత్తు విష్ణు స్వరూపం. అన్ని కోరికలను తీరుస్తుంది. ఏకాదశముఖి హనుమాన్ స్వరూపంగానూ.. ద్వాదముఖిని ఆదిత్య స్వరూపంగానూ.. త్రయోదశముఖిని ఇంద్రుని స్వరూపంగానూ.. చతుర్దశముఖిని పరమశివుని స్వరూపంగానూ.. గౌరీశంకర రుద్రాక్షను పార్వతీపరమేశ్వర స్వరూపంగా భావిస్తారు.

Share this post with your friends