చార్దామ్ యాత్ర గురించి హిందువులందరికీ తెలిసే ఉంటుంది. మనదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గల గంగోత్రి, యమునోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్‌లను కలిపి చార్ ధామ్ అని పిలుస్తారు.ఈ యాత్ర ఇప్పటికే ప్రారంభమైంది. దీనికోసం ముందుగానే లక్షల సంఖ్యలో భక్తులు బుక్ చేసుకున్నారు. అసలు ఈ యాత్ర ప్రాశస్థ్యం ఏంటి? ఈ యాత్ర చేయడం వల్ల ఎన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయో చూద్దాం. ఈ యాత్ర చేసిన వారికి జన్మజన్మల పాపాలన్నీ తొలుగుతాయని నమ్మకం. తెలిసీ తెలియక చేసిన తప్పులన్నింటికీ ఈ యాత్ర ద్వారా విమోచనం లభిస్తుందట.
చార్ ధామ్ యాత్ర అంటే దైవదర్శనం మాత్రమే కాకుండా ప్రకృతి లీనంతో కూడిన దైవ దర్శనం జరుగుతుంది. ఈ నాలుగు ప్రదేశాలలోని ప్రకృతి అందాలు మనల్ని మెస్మరైజ్ చేస్తాయి. ఈ యాత్ర చేసిన వారికి ఆరోగ్యంతో పాటు ఆయుష్షు కూడా పెరుగుతుందట. చేసి వచ్చిన వారు మాత్రం మున్ముందు ఎలాంటి తప్పులూ చేయకుండా జీవించాలి. మరింత ఎరుక తో ఇక జీవితంలో పాపాలు చెయ్యకుండా జీవించాల్సి ఉంటుందని మరచిపోవద్దు. కేదార్‌నాథ్‌లో జ్యోతిర్లింగ దర్శనానంతరం స్వామివారి అభిషేక జలం స్వీకరిస్తే తప్పక మోక్షం లభిస్తుందని నమ్మకం. బద్రీనాథ్‌ను సందర్శించుకున్న వారు తిరిగి గర్భ ప్రవేశం చేయారని పండితులు చెబుతారు.