శ్రీరామనవమి రాబోతోంది. భద్రాచలంలో సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దక్షిణాదిలో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకునే దేవాలయం కావడంతో కొద్ది రోజుల ముందు నుంచే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లను అధికారులు చేశారు. అయితే శ్రీరాముడి దేవాలయాలన్నీ ఒక లెక్క.. భద్రాద్రి దేవాలయం ఒక లెక్క.అయితే భద్రాచలంలోని దేవాలయానికి ఎందుకంత ప్రత్యేకత? అంటే ఓ ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసుకుందాం.
అన్ని రామాలయాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా సీతా, లక్ష్మణ, హనుమంత సమేతుడై శ్రీరామచంద్రుడు ఆత్మారాముని రూపంలో మనకు కనిపిస్తాడు. ఇందులో ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. సీతమ్మ రాముని తొడపై కూర్చొని దర్శనమిస్తుంది. ఇది కూడా కాదు. మరేంటంటారా? అన్ని దేవాలయాల్లో లక్ష్మణుడు రాముల వారికి కుడి వైపున ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం ఎడమ వైపున ఉంటాడు. ఇది ఏ దేవాలయంలోనూ మనకు కనిపించదు. ఇక ఈ నెల 17న మిథిలా స్టేడియం స్వామివారి కల్యాణానికి సిద్ధమైపోయింది.