వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేయనుంది. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను టీటీడీ అందించనుంది. ఆలయ మాడ వీధుల్లో, భక్తుల సంచారం ఎక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ, ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు చలువపందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాటు చేసి, నేలపై నీళ్లతో ఎప్పటికప్పుడు పిచకారి చేస్తామని టీటీడీ చెబుతోంది. నారాయణగిరి ఉద్యానవనాలు, ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తామని టీటీడీ తెలిపింది.
2024-05-03