శుక్రవారం పూట దీపారాధన ఇలా చేసి చూడండి.. ఫలితం ఊహించలేరు..

ప్రతిరోజూ పూజలు చేసుకోవడం మనకు అలవాటే. దేవుడి దగ్గర దీపం వెలిగించి పూజలు చేస్తూ ఉంటాం. పూజకు ధూప, దీప నైవేద్యాలు అత్యంత కీలకం. ఇలా రోజూ చేస్తే ఇంట్లో అంతా మంచి జరుగుతుందని నమ్మకం. అయితే దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే ఇక జీవితంలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. దీపం వెలిగించేటప్పుడు ఏ ఏ నియమాలను పాటించాలో చూద్దాం. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని నాశనం చేయాలంటే ఎండుమిర్చిని దీపంలో కాల్చాలని చెబుతారు. అంతేకాకుండా ఎండుమిర్చిని దీపంలో వేసి వెలిగించినా కూడా మంచి ఫలితం ఉంటుందట.

రెండు లవంగాలను దీపంలో పెట్టి సాయంత్రం పూట దీపారాధన చేస్తే ఇంట్లో సుఖశాంతులతో పాటు ఆర్థికంగానూ చాలా బాగుంటుందట. శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. కాబట్టి ఈ రోజున ఈశాన్య మూలలో లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిదట. అలాగే దీపం వెలిగించేటప్పుడు, మీరు పత్తికి బదులుగా ఎర్రటి దారం ఉపయోగించాలట. దీపాన్ని వెలిగించడానికి ముందు దీపానికి కుంకుమ పెట్టి వెలిగిస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట. ఇలా చేస్తే ఆర్థికంగానే కాకుండా అన్ని విధాలుగా బాగుంటుందని పెద్దలు చెబుతారు. కాబట్టి ఈ నియమాలన్నింటినీ పాటిస్తూ దీపారాధన చేయండి.

Share this post with your friends